నయనతార ‘కనెక్ట్’ ఓటిటి పార్టనర్ ఫిక్స్


లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై అశ్విన్ శరవణనన్ తెరకెక్కించిన లేటెస్ట్ తమిళ హర్రర్ థ్రిల్లింగ్ మూవీ కనెక్ట్. పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ మూవీని విఘ్నేష్ శివన్ ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ యువి క్రియేషన్స్ వారు ఈ మూవీ యొక్క తెలుగు హక్కులు దక్కించుకున్నారు. కాగా నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చిన కనెక్ట్ మూవీకి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది.

అంతకముందు మాయ, గేమ్ ఓవర్, ఇరవాకాలం వంటి థ్రిల్లింగ్ హర్రర్ మూవీస్ తెరకెక్కించి విజయాలు అందుకోవడంతో పాటు ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అశ్విన్, మరొక్కసారి కనెక్ట్ మూవీ తో బాగా పేరు దక్కించుకున్నారు అనే చెప్పాలి. అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ గా ఈ మూవీ యొక్క ఓటిటి పార్టనర్ కూడా ఫిక్స్ అయింది. ప్రముఖ మాధ్యమం నెట్ ఫ్లిక్ వారు కనెక్ట్ యొక్క డిజిటల్ ప్రసార హక్కులని భారీ ధరకు కొనుగోలు చేసారు. మరి ప్రస్తుతం వెండితెర పై మంచి టాక్, కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న కనెక్ట్ రాబోయే రోజుల్లో ఇంకెంత మేర రాబడుతుందో చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.

Exit mobile version