ఓటిటిలో కూడా “మసూద” కి అదిరే రెస్పాన్స్.!


ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చి భారీ హిట్స్ అయ్యిన చిత్రాల్లో సర్ప్రైజింగ్ హిట్ “మసూద” కూడా ఒకటి. మరి టక్ జగదీశ్ ఫేమ్ టాలెంటెడ్ నటుడు తిరువీర్ నటించిన ఈ చిత్రం ఓ సాలిడ్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కగా సాయి కిరణ్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రం థియేటర్స్ లో అయితే ఆడియెన్స్ ని అమితంగా థ్రిల్ చేసి భారీ లాభాలు గడించగా ఓటిటి రిలీజ్ కోసం కూడా ఆడియెన్స్ చాలా ఆసక్తి కనబరిచారు.

ఇక ఎట్టకేలకి అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఆహా లో స్ట్రీమింగ్ కి రాగా ఇక్కడ కూడా చాలా మంది ఆడియెన్స్ ని ఈ చిత్రం థ్రిల్ చేసినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియాలో కూడా మొదటిసారి చూసినవారు తమ ఎగ్జైట్మెంట్ ని ఈ హారర్ థ్రిల్లర్ విషయంలో వ్యక్తం చేస్తున్నారు. దీనితో అయితే ఈ చిత్రానికి మరోసారి అదిరే రెస్పాన్స్ వచ్చింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో సంగీత తదితరులు నటించగా ప్రశాంత్ ఆర్ విహారి సాలిడ్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version