డార్లింగ్ ఫ్యాన్స్ పవర్ కి క్రాష్ అయిన ఆహా యాప్


ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహాలో ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రసారం అవుతున్న క్రేజీ ఎంటర్టైన్మెంట్ షో అన్ స్టాపబుల్ సీజన్ 2. ఇక ఆడియన్స్ ని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ మంచి క్రేజ్ తో కొనసాగుతున్న ఈ సూపర్ షో యొక్క తాజా ఎపిసోడ్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యాక్షన్ హీరో గోపీచంద్ ప్రత్యేక గెస్ట్ లుగా విచ్చేసారు. రెండు భాగాలుగా వీరిద్దరి ఎపిసోడ్ ని ప్రసారం చేయనున్నట్టు ఇటీవల ప్రకటించిన ఆహా వారు, అందులో మొదటి భాగాన్ని నేడు రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ చేసారు.

అయితే ట్విస్ట్ ఏంటంటే, డార్లింగ్ ప్రభాస్ వచ్చిన ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్రస్తుతం భారీ స్థాయి రెస్పాన్స్ అందుకోవడంతో ఒక్కసారిగా ఆహా యాప్ క్రాష్ అయింది. దానితో కొద్దిసేపటి క్రితం ఆహా వారు దీనిపై స్పందిస్తూ, డార్లింగ్ ఫ్యాన్స్ కొద్దిసేపు వెయిట్ చేయండి, ప్రస్తుతం క్రాష్ అయిన యాప్ పై మా టీమ్ వర్క్ చేస్తోంది, మరికొద్దిసేపటిలో యాప్ రీస్టోర్ అవుతుందని తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక పోస్ట్ చేస్తూ తెలిపారు.

Exit mobile version