“బిగ్ బాస్ 6” ఫినాలేకి షాకింగ్ టీఆర్పీ.!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిగ్గెస్ట్ పాపులర్ టెలివిజన్ గ్రాండ్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది “బిగ్ బాస్” అని చెప్పాలి. మన ఇండియాలో కూడా ఈ షో ఎంటర్ అయ్యాక ఇండియాలో కూడా మంచి ఆదరణ తెచ్చుకుంది. అలా తెలుగులో కూడా స్టార్ట్ కాగా తెలుగులో అయితే ఏకంగా ఇండియాలో ఏ భాషలో బిగ్ బాస్ కి కూడా రాని రేటింగ్స్ తెలుగులో నమోదు అయ్యాయి.

మరి ఇప్పుడు మొత్తం 6 సీజన్లను ఈ షో తెలుగులో కంప్లీట్ చేసుకోగా తెలుగులో గత 5 సీజన్ల వరకు మంచి రేటింగ్స్ అందుకున్న ఈ షో ఫినాలే రేటింగ్స్ కూడా భారీ లెవెల్లో వచ్చేవి. మరి లేటెస్ట్ గా అయితే ఈసారి కొత్త సీజన్ తాలూకా రేటింగ్ కోసం తెలుస్తుంది. ఈసారి మాత్రం తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లోనే అతి తక్కువ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈసారి ఫినాలే కి ఎంత వచ్చింది అంటే కేవలం 8.17 వచ్చిందట. దీని బట్టి ఆడియెన్స్ లో బిగ్ బాస్ పై ఆసక్తి తగ్గిపోయిందా లేక మేకర్స్ సరైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోతున్నారా అనేది బేరీజు వేసుకోవాల్సి ఉంది.

Exit mobile version