పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆదిపురుష్ మూవీ షూట్ పూర్తి చేసిన ప్రభాస్ ప్రస్తుతం సలార్, మారుతీ తో మూవీ, అలానే ప్రాజక్ట్ కె మూవీస్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా బాలకృష్ణ హోస్ట్ గా ఆహా లో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 యొక్క లేటెస్ట్ ఎపిసోడ్ కి తన ఫ్రెండ్ గోపీచంద్ తో కలిసి గెస్టు గా వచ్చారు ప్రభాస్. రెండు భాగాలుగా ప్రసారం కానున్న వీరిద్దరి స్పెషల్ ఎపిసోడ్ మొదటి ఎపిసోడ్ ఇటీవల ప్రసారమై భారీ వ్యూస్ అందుకుంది.
కాగా రెండవ ఎపిసోడ్ ప్రోమోని కొద్దిసేపటి క్రితం ఆహా వారు రిలీజ్ చేసారు. మొదటి భాగాన్ని మించేలా మరింత ఫన్, ఎంటర్టైన్మెంట్ అంశాలతో ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి స్పందన అందుకుంటోంది. కాగా రెండవ భాగం ఫుల్ ఎపిసోడ్ ని ఆహాలో జనవరి 6న ప్రసారం చేయనున్నారు.