ఓటిటి సమీక్ష: మిషన్ మజ్ను – నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ చిత్రం

ATM Telugu Movie Review

విడుదల తేదీ : జనవరి 20, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: సిద్దార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్న, షరీబ్ హష్మీ, పర్మీత్ సేథి, మీర్ సర్వర్, రజిత్ కపూర్, కుముద్ మిశ్రా

దర్శకుడు : శంతను బాగ్చి

నిర్మాతలు: రోనీ స్క్రూవాలా, అమర్ బుటాలా, గరిమా మెహతా

సంగీత దర్శకులు: తనిష్క్ బాగ్చి, రోచక్ ఖోలీ, అర్కో

సినిమాటోగ్రఫీ: బిజితేష్ దే

ఎడిటర్: నితిన్ బైద్, సిద్దార్థ్ ఎస్ పాండే

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

సిద్దార్థ్ మల్హోత్రా మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన మిషన్ మజ్ను అనే స్పై థ్రిల్లర్ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ ను ఎంచుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. అది ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ:

1970వ దశకంలో జరిగిన ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. పాకిస్తాన్‌లో నివసించే ఒక రహస్య గూఢచారి ఏజెంట్ కథను ఇందులో చూపించడం జరిగింది. భారతదేశం తన మొదటి అణుబాంబు పరీక్షను విజయవంతంగా నిర్వహించింది, ఇది పాకిస్తాన్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. పొరుగు దేశం ఇది ముప్పుగా భావించి భారతదేశాన్ని కూల్చివేసేందుకు అణుబాంబును తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఈ పని కోసం పాకిస్తాన్ గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ ఖదీర్ ఖాన్ (మీర్ సర్వర్) సహాయం తీసుకుంటుంది. RAW దీన్ని గురించి తెలుసుకొని, అణు కేంద్రం ఉన్న ప్రదేశం గురించి తెలుసుకోవడానికి మరియు దానిని న్యూట్రలైజ్ చేయడానికి గూఢచారి ఏజెంట్ తారిక్ అలియాస్ అమన్‌దీప్ అజిత్‌పాల్ సింగ్ (సిద్దార్థ్ మల్హోత్రా) సహాయాన్ని కోరుతుంది. తారిక్ రహస్య ప్రదేశాన్ని ఎలా కనుగొంటాడు? పాకిస్తాన్ యొక్క దుష్ట ప్రణాళిక నుండి భారతదేశాన్ని ఎలా రక్షించాడు? అనే విషయాలతో మిగిలిన చిత్రం డీల్ చేస్తుంది.

 

ప్లస్ పాయింట్స్:

భారతదేశం యొక్క అత్యంత ముఖ్యమైన మిషన్లలో ఒకదాని గురించి, తెలియని కథను చెప్పాలనే ఉద్దేశ్యం ప్రశంసనీయం. సినిమా మొదలై ఎక్కువ సమయం వృధా చేయకుండా నేరుగా పాయింట్‌కి వస్తుంది. పాకిస్తాన్ సైన్యం దేశాన్ని ఎలా నియంత్రిస్తుంది మరియు ప్రభుత్వంలో మార్పులు, నిఘా సంస్థలపై ఎలా ప్రభావం చూపుతాయి వంటి కొన్ని అంశాలు చక్కగా చిత్రీకరించబడ్డాయి. సినిమా చాలా వరకు శరవేగంగా సాగుతుంది.

భారతీయ గూఢచారి పాత్రలో సిద్దార్థ్ మల్హోత్రా అద్భుతంగా నటించాడు. అతని నటన సినిమా కి అతిపెద్ద ప్లస్ పాయింట్. యంగ్ హీరో మరోసారి తాను ఏ పాత్రనైనా సులభంగా తీయగలడని నిరూపించాడు. అది అతని కామెడీ టైమింగ్ అయినా, ఎమోషనల్ సీన్స్ అయినా, నటుడు సూపర్ గా చేసాడు. సిద్ధార్థ్ పాత్ర దేశద్రోహి కొడుకుగా, ఈ అంశం ఎమోషనల్ టచ్ ఇవ్వడానికి చక్కగా చూపబడింది.

ఈ చిత్రం అక్కడక్కడ మంచి మూమెంట్స్ తో ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ చూడటానికి ఎంటర్టైనింగ్ గా ఉంది. షరీబ్ హష్మీ తన పాత్రలో బాగా నటించాడు. అలాగే కుముద్ మిశ్రా కూడా. రష్మిక మందన్న కొద్దిసేపే కనిపించినప్పటికీ చాలా బాగా నటించింది.

 

మైనస్ పాయింట్స్:

ఈ స్పై జానర్‌లో అలియా భట్ యొక్క రాజీ, అక్షయ్ కుమార్ యొక్క బేబీ, కమల్ హాసన్ విశ్వరూపం లాంటి ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. యాక్షన్ పార్ట్‌తో పాటు థ్రిల్లింగ్ మరియు సస్పెన్స్ ఎలిమెంట్‌లను అందించిన విధానం ఈ చిత్రాలకు బాగా పనిచేసింది. కానీ, ఈ చిత్రం లో అలా జరగలేదు. ఇందులో ఎలాంటి థ్రిల్‌లు లేవు, కొన్ని సన్నివేశాలు కథానాయకుడి కోసం కన్వినెంట్ గా వ్రాయబడ్డాయి.

ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు పూర్తిగా నమ్మశక్యం కానివిగా ఉన్నాయి. అప్పటి వరకు సినిమాను సెన్సిబుల్‌గా హ్యాండిల్ చేసినా, రెండో గంట పూర్తిగా టాస్‌కి వెళ్లింది. యాక్షన్ పార్ట్ బలహీనంగా ఉంది. చాలా లాజిక్‌లు పూర్తిగా విస్మరించబడ్డాయి, ఇది స్పై జానర్ కి సంబంధించిన చిత్రం కాదు.

వీఎఫ్ఎక్స్ సినిమా కి మైనస్ గా మారింది, అంతగా ఆకట్టుకోలేదు. సినిమా అత్యంత ఊహించదగినదిగా మారుతుంది, క్లైమాక్స్‌ను ముందుగా ఊహించడం చాలా సులభం అవుతుంది. సైన్యం యొక్క బ్రిగేడియర్ నుండి సున్నితమైన సమాచారాన్ని సేకరించేందుకు సిద్దార్థ్ ప్రయత్నించడం, కీలకమైన విషయాల గురించి యాదృచ్ఛికంగా అపరిచితులను అడగడం వంటి కొన్ని సన్నివేశాలు అస్సలు నమ్మశక్యంగా అనిపించలేదు. ఈ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేదు.

 

సాంకేతిక విభాగం:

తనిష్క్ బాగ్చి, రోచక్ ఖోలీ, ఆర్కో సంగీతం పర్వాలేదు. కంపోజ్ చేసిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. బిజితేష్ దే సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నితిన్ బైద్, సిద్దార్థ్ ఎస్ పాండే ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

దర్శకుడు శంతను బాగ్చి విషయానికి వస్తే, అతను సినిమాతో పర్వాలేదు అని అనిపించాడు. ప్రవీణ్ షేక్ మరియు అసీమ్ అరోరా రచనకు చాలా వరకు దిద్దుబాట్లు అవసరమవుతాయి. సినిమాలో ఉన్న రొటీన్ ఫ్యాక్టర్‌ను తగ్గించడానికి మరిన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్‌లను చేర్చి ఉంటే బాగుండేది.

 

తీర్పు:

మొత్తం మీద, మిషన్ మజ్నులో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. కానీ కొన్ని అనవసరమైన సన్నివేశాలు, లాజిక్ లేకుండా సాగే కథనం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. ఈ స్పై థ్రిల్లర్‌కి సిద్దార్థ్ ప్రాణం పోశాడు. ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. లాజిక్‌లను విస్మరించగలిగితే, ఈ వారాంతంలో ఈ చిత్రం ను ఒకసారి చూడవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version