సమీక్ష : పఠాన్ – ఇంప్రెస్ చేసే యాక్షన్ థ్రిల్లర్

Pathaan Movie-Review-In-Telugu

విడుదల తేదీ : జనవరి 25, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్, జాన్ అబ్రహం, అశుతోష్ రానా, డింపుల్ కపాడియా తదితరులతో పాటు అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్

దర్శకుడు : సిద్ధార్థ్ ఆనంద్

నిర్మాతలు: ఆదిత్య చోప్రా

సంగీత దర్శకులు: సంచిత్ బల్హారా, అకింత్ బల్హారా

సినిమాటోగ్రఫీ: సంచిత్ పౌలోస్

ఎడిటర్: ఆరిఫ్ షేక్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

సిద్ధార్థ్ ఆనంద్ దర్శత్వంలో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన కొత్త సినిమా పఠాన్. కాగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ భారీ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

 

కథ :

 

భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాకిస్తాన్ కల్నల్ ఇండియా మీద ఓ అటాక్ ప్లాన్ చేస్తాడు. దాని కోసం ప్రైవేట్ ఎజెంట్ అయిన జిమ్ (జాన్ అబ్రహం) తో ఒప్పందం కుదుర్చుకుంటాడు. దాంతో భారత్ పై బయో వార్ ప్లాన్ చేస్తాడు జిమ్. అయితే ఆ ప్లాన్ అడ్డుకునేందుకు పఠాన్‌ (షారుఖ్ ఖాన్‌) రంగంలోకి దిగుతాడు. అసలు జిమ్ చేసిన రక్త భీజ్‌ ప్లాన్ ఏమిటి ?, ఈ మధ్యలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ రూబై (దీపికా పదుకోన్) పాత్ర ఏమిటి ?, అసలు ఆమెకు పఠాన్ కి మధ్య ఏం జరిగింది ? చివరకు ‘పఠాన్’ జిమ్ ను ఎలా అంతం చేశాడు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

షారుఖ్ ఖాన్ వన్ మ్యాన్ షోతో నడిచిన ఈ సినిమాలో.. పఠాన్ పాత్రలో షారుఖ్ ఖాన్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా తన యాక్షన్ బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్ స్ లో షారుఖ్ ఖాన్ నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. అలాగే ట్రైన్ ఎపిసోడ్ లో గెస్ట్ గా మెరిసిన సల్మాన్ ఖాన్ ఈ సినిమాకి ప్రతేక ఆకర్షణగా నిలిచాడు.

ఇక హీరోయిన్ గా నటించిన దీపికా పదుకోన్ కూడా తన బోల్డ్ లుక్స్ తో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. ముఖ్యంగా బికినీ సాంగ్ లో ఆమె గ్లామర్ యూత్ ను బాగా ఆకట్టుకుంది. విలన్ పాత్రలో నటించిన జాన్ అబ్రహంకి పెద్దగా నటించే స్కోప్ లేదు. అయితే ఉన్నంతలో అతను బాగానే నటించాడు. ఇక మిగిలిన కీలక పాత్రల్లో నటించిన అశుతోష్ రానా, డింపుల్ కపాడియా బాగానే నటించారు.

ఈ సినిమాలో డింపుల్ కపాడియాకి మంచి క్యారెక్టర్ దొరికింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని సస్పెన్స్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లోని చాలా సీన్స్, మరియు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

పఠాన్ కథలో డెప్త్ ఉన్నా.. కొన్ని సీన్స్ కన్ ఫ్యూజ్డ్ గా సాగాయి. పైగా మెయిన్ ప్లాట్ లోని మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ప్రధాన కాన్ ఫ్లిక్ట్ ను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. అలాగే హీరో పాత్రలోని ఎమోషన్ కూడా ఇన్ వాల్వ్ అయ్యేలా లేదు. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. పైగా జిమ్ పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూ, అలాగే జిమ్ మోటివ్ ను కూడా ఇంకా బాగా రాసుకుని ఉండాల్సింది.

దీనికితోడు సినిమాలో సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ప్లే ను బిల్డ్ చేయలేకపోయారు. పైగా కొన్ని సీన్స్ లో నాటకీయత ఎక్కువడంతో ఆ సీన్స్ లో సహజత్వం లోపించింది. అయితే, దర్శకుడు సెకెండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, ఓవరాల్ కొన్ని చోట్ల లాజిక్స్ వదిలేశారు.

 

సాంకేతిక విభాగం :

 

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ అందరికీ అర్థం అయ్యేలా, అదే విధంగా ఆకట్టుకునేలా ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకుని ఉండి ఉంటే ఇంకా బాగుండేది.

 

తీర్పు :

 

భారీ పెర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ పఠాన్ బాగానే ఆకట్టుకుంది. భారీ యాక్షన్ తో పాటు బోల్డ్ ఎలిమెంట్స్, సల్మాన్ ఎంట్రీ సీన్, మరియు ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ చాలా బాగున్నాయి. అయితే, కొన్ని సీన్స్ కన్ ఫ్యూజ్డ్ గా సాగడం, స్క్రీన్ ప్లేలో కొన్ని చోట్ల ఇంట్రెస్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. కాకపోతే, సినిమాలో షారుఖ్ ఖాన్ నటన అద్భుతంగా ఉంది. ఓవరాల్ గా ఈ చిత్రం షారుఖ్ ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. యాక్షన్ ఫీస్ట్ లా అనిపిస్తోంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version