టాలీవుడ్ యువ టాలెంటెడ్ యాక్టర్ శర్వానంద్ కెరీర్ పరంగా వరుసగా మంచి విజయాలతో ప్రేక్షకాభిమానుల నుండి మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు. ఇటీవల ఒకేఒక జీవితం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న శర్వానంద్, త్వరలో శ్రీరామ్ ఆదిత్యతో ఒక మూవీ చేయనున్నారు. ఇక అతి త్వరలో శర్వానంద్ పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. కాగా నేడు హైదరాబాద్ లో శర్వానంద్, రక్షిత రెడ్డి ల ఎంగేజ్మెంట్ ఎంతో గ్రాండ్ గా జరిగింది.
పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా విచ్చేసిన ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు కూడా ప్రత్యేకంగా విచ్చేసి శర్వానంద్, రక్షిత రెడ్డి లను ఆశీర్వదించారు. కాగా అతి త్వరలో వీరి వివాహ వేడుక యొక్క డేట్ ని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. మొత్తంగా తమ అభిమాన హీరో పెళ్లిపీటలెక్కబోతుండడంతో పలువురు టాలీవుడ్ ప్రేక్షకులు, శర్వానంద్ అభిమానులు ఆయనకు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ముందస్తు వివాహ శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు. ఇక వీరి ఎంగేజ్మెంట్ కి మెగాస్టార్ దంపతులు విచ్చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.