త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా విశాల్ “లాఠీ”


కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ హీరోగా, ఏ. వినోత్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ లాఠీ. రానా ప్రొడక్షన్స్ పతాకంపై రమణ, నంద దురైరాజ్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతోంది.

త్వరలో ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ టీవీ లో ప్రసారం కానుంది. సునైన, ప్రభు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. మరి ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version