యువ నటుడు సుహాస్ హీరోగా టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ రైటర్ పద్మభూషణ్. మొదటి రోజు మొదటి ఆట నుండే ఆడియన్స్ నుండి మంచి సక్సెస్ టాక్ ని సంపాదించిన ఈ మూవీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి ఆదరణ అందుకుంటూ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది.
షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ సంయుక్తంగా నిర్మించారు. మంచి లవ్ ఎమోషనల్ హార్ట్ టచింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రైటర్ పద్మభూషణ్ గడచిన 6 రోజుల్లో వరల్డ్ వైడ్ మొత్తం కలిపి రూ. 7.29 కోట్లు కొల్లగొట్టినట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఇక ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న ప్రత్యేకంగా మహిళల కోసం ఎంపిక చేసిన పలు థియేటర్స్ లో ప్రదర్శించగా వాటికి మంచి రెస్పాన్స్ లభించదని, తమ సినిమాని ఇంతగా ఆదరిస్తున్న ఆడియన్స్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తోంది రైటర్ పద్మభూషణ్ యూనిట్.