ఫ్యాన్స్ కు సందీప్ కిషన్ బంపర్ ఆఫర్!


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ మొదటి పాన్ ఇండియన్ చిత్రం మైఖేల్ ఇటీవలే థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. రంజిత్ జెయకోడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సందీప్ కిషన్‌ సరసన హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్ నటించింది. సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసింది. మైఖేల్ ఈ శుక్రవారం ఆహా వీడియో లో డిజిటల్ ప్రీమియర్‌ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సందర్భంగా నటుడు ఇప్పుడు తన ఫ్యాన్స్ కి ఓ ప్రామిస్ చేశాడు. దీని ప్రకారం, అతను తన అభిమానులకు ఆహా వీడియో యొక్క 2000 త్రైమాసిక సభ్యత్వాలను బహుమతిగా ఇవ్వనున్నాడు. తనకు అన్ని సమయాల్లో అండగా నిలిచినందుకు సందీప్ కిషన్ అభిమానులకు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్, గౌతం వాసుదేవ్ మీనన్, అనసూయ భరద్వాజ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌లపై భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version