ఓటిటి సమీక్ష : “యాంగర్ టేల్స్” తెలుగు సిరీస్ డిస్నీ+ హాట్ స్టార్ లో

Anger Tales Telugu Movie Review

విడుదల తేదీ : మార్చి 09, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: వెంకటేష్ మహా, సుహాస్, రవీంద్ర విజయ్, బిందు మాధవి, ఫణి ఆచార్య, తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్

దర్శకుడు : ప్రభల తిలక్

నిర్మాతలు: శ్రీధర్ రెడ్డి & సుహాస్

సంగీత దర్శకులు: స్మరణ్ సాయి

సినిమాటోగ్రఫీ: అమర్‌దీప్, వినోద్ కె బంగారి, వెంకట్ ఆర్ శాఖమూరి, ఎజె ఆరోన్

ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఇప్పుడు థియేటర్స్ సహా ఓటిటి లో కూడా పలు చిత్రాలు మరియు సిరీస్ లు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అలా ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ డిస్నీ+ హాట్ స్టార్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ అంథాలజీ సిరీస్ “యాంగర్ టేల్స్”. టాలెంటెడ్ నటుడు సుహాస్, వెంకటేష్ మహా తదితరులు నటించిన ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

ఈ యాంగర్ టేల్స్ లో మొత్తం నలుగురికి సంబంధించి కథలు కనిపిస్తాయి. ఆ నలుగురు తమ జీవితంలో పరిస్థితులతో చాలా విస్తుపోయి పట్టరాని కోపంతో కనిపిస్తారు. మొదటి ఎపిసోడ్ రంగా(వెంకటేష్ మహా) ఓ స్టార్ హీరో ఫ్యాన్ అయ్యిన తాను తన హీరో బెనిఫిట్ షో కోసం ఏం చేసాడు? ఇక రెండో కథ పూజా రెడ్డి(మడోనా సెబాస్టియన్) ఆమెకి పెళ్లయ్యాక ఆమె తిండి విషయంలో తన అత్తవాళ్ళు పెట్టే కట్టుబాట్లు విషయంలో తనకి నచ్చిన ఆహారాన్ని కూడా తీసుకోలేని స్వేచ్ఛ లేనందున తీవ్ర అసంతృప్తితో ఉంటుంది. ఇక మరో కథ రాధ(బిందు మాధవి) అనే ఓ సాధారణ గృహిణి తన నిద్ర విషయంలో తన ఓనర్, వాళ్ళ రిలేటివ్స్ విషయంలో ఎదురయిన సమస్యలు ఏంటి? ఫైనల్ గా గిరిధర్(ఫణి ఆచార్య) అనే మధ్య వయస్కుడు తన బట్టతల మూలాన తన పర్సనల్, ప్రొఫిషినల్ లైఫ్ లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు? మరి ఈ లైఫ్ లలో తమ యాంగర్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అనేది ఈ అంథాలజీ లో మెయిన్ గా కనిపించే అంశాలు మరి వీరి భావోద్వేగాలు ఎలా ఉంటాయి? వారి కథలకి ముగింపు ఎలా ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

మొదటగా ఈ సిరీస్ లో ఎంచుకున్న నేపథ్యం ఒకొక్క పాత్రకి సంబంధించిన బ్యాక్ డ్రాప్ ఆసక్తిని కలిగిస్తాయి. అయితే వీటిలో అందరి కన్నా లేటెస్ట్ గా సినిమాల విషయంలోనే సెన్సేషన్ గా మారిన వెంకటేష్ మహా చేసిన రంగ రోల్ అని చెప్పాలి. ఇందులో తాను ఓ స్టార్ హీరో కి వీరాభిమానిగా కనిపిస్తాడు.

 

ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ చాలా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. సాలిడ్ ఎమోషన్స్ మరియు డీసెంట్ ఫన్ తో అయితే ఈ ఎపిసోడ్ సాగుతుంది. అంతే కాకుండా ఈ ఎపిసోడ్ లోనే కనిపించే సుహాస్ కూడా సాలిడ్ పెర్ఫామెన్స్ కనబరిచాడు. అలాగే వెంకటేష్ మహా నట సామర్ధ్యం అంటే సుందరానికి లోనే చూసాం కానీ ఇందులో ఇందులో అంతకు మించి ఉంటుంది అని చెప్పడం లో సందేహం లేదు.

 

ఇక అలాగే మరో ఎపిసోడ్ లో కనిపించే మడోనా మరియు తరుణ్ భాస్కర్ లు మంచి నటన కనబరిచారు అలాగే వారి ఎపిసోడ్ లో మెసేజ్ బాగుంది. ఇక మరో ఎపిసోడ్స్ లో నటులు బిందు మాదవి, ఫణి ఆచార్య లు కూడా మంచి నటన కనబరుస్తారు. డీసెంట్ ఎమోషన్స్ అన్నీ బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సిరీస్ నాలుగు ఎపిసోడ్స్ గానే ప్లాన్ చేయడం మంచి విషయమే కానీ మళ్ళీ కొద్దిగా లో కూడా డిజప్పాయింట్ చేసే అంశాలు లేకపోలేవు. మెయిన్ గా ఓ రెండు ఎపిసోడ్స్ అంత ఎఫెక్టీవ్ గా అయితే అనిపించవు. ఫణి ఆచార్య ఎపిసోడ్ అయితే స్టార్టింగ్ బాగానే అనిపించినా తర్వాత ఆ ఎపిసోడ్ నిరాశపరుస్తుంది.

 

అలాగే కొన్ని సన్నివేశాలు హిందీలో బాల తెలుగులో నూటొక్క జిల్లాల అందగాడు సినిమా తరహా షేడ్స్ లో కనిపిస్తాయి. దీనితో ఇది రెగ్యులర్ గానే అనిపిస్తుంది. ఇక అలాగే బిందు మాధవి ఎపిసోడ్ లో కూడా అలాగే ఆ పాయింట్ కూడా బాగున్నప్పటికీ ఆసక్తికర నరేషన్ అయితే కనిపించదు.

 

దీనితో ఈ ఎపిసోడ్ కూడా వీక్షకులని అంత ఆకట్టుకోకపోవచ్చు. ఈ రెండు ఎపిసోడ్స్ గాని మిగతా వాటిలా పర్ఫెక్ట్ గా తెరకెక్కించి ఉంటే ఈ సిరీస్ మరింత మంచి రిజల్ట్ ని దక్కించుకుని ఉండేది. వీటిలో పలు అనవసర సన్నివేశాలు తగ్గించి ఉంటే ల్యాగ్ ఫీల్ తగ్గి ఉండేది.

 

సాంకేతిక వర్గం :

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే ఇందులో ఎమోషన్స్ కి తగ్గట్టుగా స్మరన్ సాయి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయ్యింది. అలాగే సినిమాటోగ్రఫీ ఒకో ఎపిసోడ్ కి ఒకొక్కరు అందించగా అంతా మంచి వర్క్ ని ఇచ్చారు. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ బెటర్ గా చేయాల్సింది.

 

ఇక దర్శకుడు ప్రభల తిలక్ విషయానికి వస్తే తన వర్క్ పర్వాలేదని చెప్పొచ్చు. సినిమా ఎపిసోడ్ ని తాను సాలిడ్ గా హ్యాండిల్ చేసారు అలాగే ఎమోషన్స్ కూడా బాగున్నాయి కానీ ఓ రెండు ఎపిసోడ్స్ వర్క్ మాత్రం చాలా నిరాశపరుస్తుంది. దీనితో ఓవరాల్ గా తన వర్క్ బ్యాలన్స్ అయినట్టు అనిపిస్తుంది అంతే తప్ప అన్ని ఎపిసోడ్స్ కి కలిపి ఓ రేంజ్ లో ఉన్నాయని చెప్పలేం.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “యాంగర్ టేల్స్” లో కొన్ని అంశాలు బాగుంటాయి తప్ప పూర్తి స్థాయిలో ఆకట్టుకునే సిరీస్ అయితే ఇది కాదని చెప్పాలి. సిరీస్ నేపథ్యం బాగుంటుంది వెంకటేష్ మహా, సుహాస్ ఇతర నటుల నటన బాగుంటుంది. కానీ ఆకట్టుకునే ప్రెజెంటేషన్ మాత్రం బాగా మిస్ అవుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని అయితే ఈ వారాంతానికి ఒక్కసారికి మాత్రం చూడొచ్చు.

 

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version