వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయిన విజయ్ “వరిసు”

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన వరిసు చిత్రం 2023 సంక్రాంతికి విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచింది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. తాజా వార్త ఏమిటంటే, ఈ చిత్రం (తమిళ వెర్షన్) ఏప్రిల్ 14, 2023న సన్ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కి సిద్ధంగా ఉంది.

ఈ చిత్రం సాయంత్రం 06:30 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ బిగ్గీలో రష్మిక మందన్న కథానాయిక గా నటిస్తుంది. శరత్‌కుమార్, జయసుధ, ప్రకాష్ రాజ్, ప్రభు తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మించిన ఈ బిగ్గీకి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఎస్ సంగీతం అందించాడు.

Exit mobile version