థియేటర్‌/ఓటీటీ : ఉగాది స్పెషల్‌ గా వచ్చే చిత్రాలివే!

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలాగే థియేటర్స్ లో కూడా ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు రాబోతున్న ఓటీటీ & థియటర్స్ చిత్రాల పై ఓ లుక్కేద్దాం.

థియేటర్స్ లో రిలీజవుతున్న చిత్రాలు ఇవే.

ధమ్కీ :

విశ్వక్‌ సేన్‌, నివేదా పేతురాజ్‌ కలిసి నటించిన చిత్రం ‘దాస్‌ కా ధమ్కీ’. విశ్వక్‌సేనే ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. యాక్షన్‌- కామెడీ తరహాలో రూపొందింది. ఈ చిత్రం ఉగాది స్పెషల్ గా రాబోతుంది.

 

రంగస్థల కళాకారుల జీవితం రంగమార్తాండ :

‘రంగమార్తాండ’తో రాబోతున్నారు దర్శకుడు కృష్ణవంశీ. మరాఠీ హిట్‌ చిత్రం ‘నట్‌సామ్రాట్‌’కు రీమేక్‌గా దాన్ని రూపొందించారాయన. ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్‌ సిప్లిగంజ్‌, శివాత్మిక రాజశేఖర్‌ తదితరులు నటించారు. ఈ చిత్రం కూడా ఉగాది స్పెషల్ గా రాబోతుంది.

 

‘ఘోస్టి :

కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రధారిగా దర్శకుడు కల్యాణ్‌ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘ఘోస్టి’. తెలుగులో ‘కోస్టి’ పేరుతో రిలీజ్‌ అవుతోంది. హారర్‌ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో యోగిబాబు, ఊర్వశి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం కూడా ఉగాది స్పెషల్ గా రాబోతుంది. గీతసాక్షిగా అనే సినిమా కూడా మార్చి 22న రాబోతుంది.

 

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

ఈటీవీ విన్‌ లో పంచతంత్రం స్ట్రీమింగ్‌ కానుంది.

ఆహా విన్‌ లో వినరో భాగ్యము విష్ణుకథ స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌ విన్‌ లో అమెరికన్‌ అపోకలిప్స్‌ (ఇంగ్లిష్‌) స్ట్రీమింగ్‌ కానుంది.

Exit mobile version