దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థల పై ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ PS 2. గత ఏడాది రిలీజ్ అయి పెద్ద విజయం అందుకున్న PS 1 కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ భారీ పాన్ ఇండియన్ మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు.
విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, ప్రకాష్ రాజ్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న గ్రాండ్ గా పలు భాషల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీలో ఆదిత్య కరికాలుడిగా నటిస్తున్న విక్రమ్ కి సంబంధించి ఒక్క చిన్న వీడియో బైట్ రిలీజ్ చేసిన మేకర్స్, ట్రైలర్ లోడింగ్ అంటూ అప్ డేట్ అందించారు. మరోవైపు రోజురోజుకు అందరిలో ఎన్నో భారీ స్థాయి అంచనాలు ఏర్పరుస్తున్న PS 2 మూవీ తప్పకుండా అందరి అంచనాలు అందుకుని సక్సెస్ అవుతుందని యూనిట్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
From courage to charm!
The transformation of @chiyaan into the legendary warrior prince, #AdithaKarikalan– A treat for the fansStay tuned for the trailer????#PS2 #ManiRatnam @arrahman @madrastalkies_ @LycaProductions @Tipsofficial @ekalakhani #VikramGaikwad @kishandasandco pic.twitter.com/EBeBktkOJt
— Lyca Productions (@LycaProductions) March 23, 2023