టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ గా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న స్టార్ ప్రొడ్యూసర్


టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా వరుసగా అనేక సినిమాలు చేస్తూ వాటితో పలు సక్సెస్ లు సొంతం చేసుకుంటూ మంచి పేరుతో దూసుకెళ్తున్నారు దిల్ రాజు. కెరీర్ బిగినింగ్ లో డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన రాజు, ఆ తరువాత 2003లో నితిన్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన దిల్ మూవీని తొలిసారిగా నిర్మించారు. ఆ విధంగా ఫస్ట్ మూవీతోనే తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మంచి సక్సెస్ సొంతం చేసుకున్న దిల్ రాజు, అక్కడి నుండి అనేక విజయాలు అందుకున్నారు.

అలానే పలువురు యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలతో సైతం ఆయన సక్సెస్ లు సొంతం చేసుకోవడం విశేషం. ఇక నిన్నటితో నిర్మాతగా ఆయన సినీ కెరీర్ సక్సెస్ఫుల్ గా 20 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో పలువురు సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ఆయనకు ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియచేస్తున్నారు. కాగా నేడు సాయంత్రం 5 గం. లకు ఎస్విసి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా #AskDILRAJU హ్యాష్ ట్యాగ్ తో ప్రేక్షకాభిమానుల తో చాట్ సెషన్ నిర్వహించనున్నారు దిల్ రాజు.

Exit mobile version