చిట్ చాట్ : కార్తీ – బాక్సర్ గా కండలు తిరిగిన బాడీతో కనిపిస్తా..

Karthi

‘యుగానికి ఒక్కడు’, ‘ఆవారా’, ‘నా పేరు శివ’ సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్, మార్కెట్ సంపాదించుకున్న తమిళ హీరో కార్తీ. ప్రస్తుతం కార్తీ తమిళంలో నటించిన ‘అలెక్స్ పాండ్యన్’ సినిమా ‘బ్యాడ్ బాయ్’ గా తెలుగులో మార్చి 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో కార్తీ మాట్లాడుతూ ‘ ఇది పక్కా మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్. ఇలాంటి తరహా సినిమాని నేను ఇప్పటి వరకూ చెయ్యలేదు. ఈ సినిమాకి యాక్షన్ సీక్వెన్స్, కామెడీ, మ్యూజిక్ హైలైట్ గా చెప్పుకోవాలి. అలాగే ఈ సినిమా స్టంట్స్ ఎంతో కష్టపడి చేసాము. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. తెలుగు వెర్షన్ ని మరింత ఆసక్తికరంగా తయారు చేయడం కోసం ఒక 20 నిమిషాల సినిమాని ట్రిమ్ చేసాము. ఇప్పుడు తమిళ్ కంటే తెలుగులో ఇంకా బాగుంది. ఈ సినిమా మీకందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని ‘ అన్నారు. ఆ తర్వాత మేము అడిగిన ఓ నాలుగు ప్రశ్నలకి ఇలా సమాధానమిచ్చారు..

ప్రశ్న) ముందుగా పాప పుట్టినందుకుశుభాకాంక్షలు. ఈ ఫీల్ఎలా ఉంది?

స) థాంక్స్ .. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఓ పాపకి నాన్న అనే ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది ఆ ఫీల్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాను. పాప పేరు ఉమయాల్. ఉమయాల్ అంటే శివుని భార్య పార్వతి పేరు. మోడ్రన్ పేర్లు ఏమీ నచ్చలేదు అలాగే నాకు మన ట్రెడిషన్, కల్చర్ అంటే ఇష్టం అందుకే ఆ పేరు పెట్టాను.

ప్రశ్న) తెలుగు డైరెక్టర్లతో సినిమా ఎప్పుడు చేస్తారు? అలాగే ఒకవేళ మీకు అవకాశమిస్తే మీకు ఏ తెలుగు డైరెక్టర్ తో పనిచేయాలనుంది?

స) ప్రస్తుతం తెలుగు డైరెక్టర్స్ కథలు వింటున్నాను కానీ ఏదీ ఫైనలైజ్ కాలేదు. అలాగే తెలుగు డైరెక్టర్స్ లో ఒక్కరితో మాత్రమే పనిచేయాలని లేదు, అవకాశం వస్తే అందరితోనూ పనిచేయాలని ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరూ ఒక్కోలా చూపించాలనుకుంటారు. ఉదాహరణకి నా రాబోయే సినిమా ‘బిరియాని’ షూటింగ్ సమయంలో డైరెక్టర్ వెంకట్ ప్రభు గారు కార్తీ నీ అన్ని సినిమాల్లో లాగానే రొటీన్ హావభావాలు పెడుతున్నావు అలాంటి ఎక్స్ ప్రెషన్స్ రిపీట్ కాకుండా చూసుకో అని అన్నారు. అలా అన్నారంటే ఆయన నాలోని కొత్త కోణాన్ని చూపిస్తున్నారు అనే కదా అర్థం. అందుకే నాకు అందరితోనూ పనిచేయాలని ఉంది.

ప్రశ్న) సూర్య గారితో కలిసి ఎప్పుడు సినిమా చేస్తున్నారు? అలాగే ఎప్పుడు అన్నయ్యలా మీరు కూడా 6 ప్యాక్ చూపిస్తున్నారు?

స)ఈ ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు. ఖచ్చితంగా ఓ సినిమా చేస్తాను. మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే అందరిలోనూ అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే స్టొరీ రాగానే చేస్తాము. అలాగే 6 ప్యాక్ లాంటిది ఏమీ నేను ట్రై చెయ్యడం లేదు. 6 ప్యాక్ నాకు సెట్ అవ్వదండి. కానీ ఓ సినిమాలో కండలు తిరిగిన బాడీతో కనిపించనున్నాను. పీరియాడిక్ నేపధ్యంలో వచ్చే ఓ సినిమాలో నటించనున్నాను. ఆ సినిమాలో నేను బాక్సర్ గా కనిపిస్తాను అందుకోసమే కండలు కనపడేలా బాడీని డెవలప్ చేస్తున్నాను. ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు.

ప్రశ్న) మీ రాబోయే చిత్రాల గురించి చెప్పండి?

స) ప్రస్తుతం ‘బిరియాని’ సినిమాలో నటిస్తున్నాను. ఇందులో నాదొక ప్లే బాయ్ క్యారెక్టర్. ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉండే రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా. సినిమా ఎంత సీరియగా రన్ అవుతున్నా ఇన్నర్ గా ఫుల్ కామెడీ ఉంటుంది. అలాగే ఈ సినిమాతో పాటు ‘ఆల్ ఇన్ ఆల్ అజుగు రాజ’ సినిమాలో నటిస్తున్నాను. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో సినిమాకి ఓకే చెప్పాను త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.

చివరిగా ‘బ్యాడ్ బాయ్’ సినిమా విజయం సూపర్ హిట్ కావాలని కార్తీకి అల్ ది బెస్ట్ చెప్పి మా చిట్ చాట్ ముగించాము.

రాఘవ

Click here for English Chit chat

Exit mobile version