ఓటిటి సమీక్ష : “సేవ్ ది టైగర్స్” – తెలుగు సిరీస్ డిస్నీ+ హాట్ స్టార్ లో

Save The Tigers Telugu Movie Review In Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 27, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: ప్రియదర్శి, అభినవ్ గోమతం, కృష్ణ చైతన్య, పావని గంగిరెడ్డి, హైమవతి, దేవియాని, రోహిణి, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షవర్ధన్ తదితరులు

దర్శకులు : తేజ కాకుమాను

నిర్మాతలు: మహి వి రాఘవ్, చిన్న వాసుదేవ రెడ్డి

సంగీత దర్శకులు: అజయ్ అరసాడ

సినిమాటోగ్రఫీ: వి.విశ్వేశ్వర్

ఎడిటర్: శ్రవణ్ కటికనేని

సంబంధిత లింక్స్: ట్రైలర్

 


గడిచిన కొన్నాళ్లలో ఓటిటి లో అయితే అందులోని మన తెలుగు నుంచి ఓ కామెడీ బ్యాక్ డ్రాప్ సిరీస్ వచ్చి చాలా కాలం అయ్యింది. మరి ఈ నేపథ్యంలో అయితే లేటెస్ట్ గా వచ్చిన సిరీస్ నే “సేవ్ ది టైగర్స్”. టాలెంటెడ్ నటులు ప్రియదర్శి, కృష్ణ చైతన్య, అభినవ్ గోమతం లు నటించిన ఈ సిరీస్ రీసెంట్ గా మంచి ప్రోమోస్ తో ఆసక్తి రేపారు. ఇక డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే..గంటా రవి(ప్రియదర్శి), రాహుల్(అభినవ్) అలాగే విక్రమ్(కృష్ణ చైతన్య) ఈ ముగ్గురు కూడా మొదట ఎవరికీ సంబంధం ఉండదు ఎవరి పనుల్లో వారు ఉంటారు. అయితే ఈ ముగ్గురూ కూడా భార్యా బాధితులే కాగా ముగ్గురూ అనుకోకుండా ఓ రోజు యాక్సిడెంటల్ గా మీట్ అయ్యి మంచి ఫ్రెండ్స్ అయ్యిపోతారు. ఇక అక్కడ నుంచి తమ ఫ్రస్ట్రేషన్ ని పంచుకుంటారు. అయితే ఓ రోజు ఫుల్ గా తాగిన వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కుంటారు. అలాగే మరోపక్క ఓ ప్రముఖ నటి కిడ్నాప్ అవుతుంది. దీనితో ఈ కిడ్నాప్ కి వారికి ఏమన్నా కనెక్షన్ ఉందా? ఎందుకు వారు అంతలా తాగాల్సి వస్తుంది? ఆ ముగ్గురు కూడా తమని తాము ఎందుకు పులులు గా అనౌన్స్ చేసుకుంటారు అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ సిరీస్ ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్స్ గా అయితే ప్లాన్ చేశారు. మరి ఈ సిరీస్ అంతా కూడా ఇంప్రెసివ్ గా సాలిడ్ కామెడీ సిరీస్ కోసం చూస్తున్న వారికి మంచి ట్రీట్ ఇస్తుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇందులో కనిపించే క్యాస్టింగ్ దర్శి – సుజాత, కృష్ణ చైతన్య – దేవయాని అలాగే పావని గంగిరెడ్డి లు తమ పాత్రల్లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిపోయారు. అలాగే అభినవ్ గౌతమ్ అయితే సిరీస్ మొత్తం తన టైమింగ్ తో ఆకట్టుకుంటాడు.

అలాగే ముగ్గురు మేల్ లీడ్ కి ఫీమేల్ లీడ్ లో నటించిన పావని, దేవయాని, అలాగే జోర్దార్ సుజాతాలు తమ రోల్స్ లో పర్ఫెక్ట్ గా స్తే అవ్వడమే కాకుండా మంచి నటన కబరిచారు. తమ భర్తను అర్ధం చేసుకునే భార్యగా ఒకరు. బాగా ఇరిటేట్ చేసే భార్యగా ఒకరు అలాగే ఫెమినిస్ట్ గా మరొకరు ఇంప్రెసివ్ నటనను అయితే కనబరిచారు. అలాగే జబర్దస్త్ రోహిణి కూడా ఈ సిరీస్ లో మంచి పాత్రలో కనిపించింది.

ఇక ఈ సిరీస్ లో మరో మంచి ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే మొదటి ఎపిసోడ్స్ కూడా అసలు టైం తెలియనట్టుగా అయిపోతాయి. మంచి హిలేరియస్ నరేషన్ తో పాటుగా బ్యూటిఫుల్ మూమెంట్స్ తో అయితే ఈ మూడు ఎపిసోడ్స్ బాగున్నాయి. అలాగే సిరీస్ కూడా పెద్దగా బోర్ లేకుండానే మంచి ఫన్ తో కొనసాగుతుంది. అలాగే మరికొన్ని సన్నివేశాలు అయితే భార్యాభర్త జంటలకు తప్పకుండా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సిరీస్ లో లాజిక్ తో సంబంధం లేకుండా నరేషన్ ఉంటుంది అని చెప్పొచ్చు. లాజిక్స్ ని వెతుక్కొని సిరీస్ లు చూసేవారికి అయితే ఇది కాస్త డిజప్పాయింటింగ్ గా అనిపించవచ్చు. అలాగే ఈ సిరీస్ లో కథ కూడా ఏమంత కొత్తగా అనిపించదు రొటీన్ గానే అనిపిస్తుంది. మొదటి 5 ఎపిసోడ్స్ తో అయితే వహివారి ఎపిసోడ్ తో మంచి ఎపిసోడ్ ని ఆశిస్తాం కానీ ఆ చివరి ఎపిసోడ్ మాత్రం కాస్త డిజప్పాయింట్ చేసేలా అనిపిస్తుంది.

అలాగే కొందరు ప్రముఖ నటులు మంచి పొటెన్షియల్ ఉండి మంచి పాత్రల్లో చూపించగలిగే వేణు యెల్దండి, యాదవ్ మరియు గంగవ్వ లాంటి వారిని మరింత మంచి స్పేస్ లో చూపించి మంచి పాత్రలు డిజైన్ చేసి ఉంటే బాగుండేది. అలాంటి నటులకి చిన్న స్పేస్ ఉన్న పాత్రల్లో చూపించేబదులు వేరే కొత్త వారికి అయినా ఇలాంటి రోల్స్ లో చూపించాల్సింది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు గాని టెక్నీకల్ టీం వర్క్ గాని ఇంప్రెసివ్ గా ఉంటుందని చెప్పాలి. విశ్వేశ్వర్ డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ అలాగే అజయ్ అరసాడ సంగీతం ఈ సిరీస్ కి బాగా ప్లస్ అయ్యాయి. అలాగే ఎడిటింగ్ కూడా బాగానే ఉంది.

ఇక దర్శకుడు తేజ కకుముంచు రచయితలు ప్రదీప్ అద్వైతం, విజయ్ నమోజు, ఆనంద్ కార్తీక్ ల టీం వర్క్ బాగుంది అని చెప్పాలి. రైటర్స్ పెద్ద కొత్త రాసుకోలేదు కానీ హిలేరియస్ నరేషన్ ని దర్శకుడు బాగా హ్యాండిల్ చేసి మంచి ట్రీట్ ని అయితే అందిస్తాడు. ఈ విషయంలో వీరి టీం కి అభినందనలు చెప్పాలి.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూస్తే ఈ “సేవ్ ది టైగర్స్” సిరీస్ లో మెయిన్ లీడ్ అంతా కూడా మంచి పెర్ఫామెన్స్ లతో ఆకట్టుకుంటారు.అలాగే ఈ సిరీస్ లో పెద్దగా కొత్త కథ, లాజిక్స్ లేకపోయినప్పటికీ ఆద్యంతం మంచి హిలేరియస్ గా సాగే కథనం కామెడీ సిరీస్ లు ఇష్టపడే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది. దీనితో ఈవారాంతంలో ఈ సిరీస్ ని ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version