‘అఖిల్’ ఏజెంట్ ఓటిటి రిలీజ్ పై క్లారిటీ

అఖిల్ హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ ఏజెంట్. సురేందర్ 2 సినిమాస్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థల పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయిన ఈ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయి విజయం అయితే అందుకోలేకపోయింది.

అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ ఓటిటి హక్కులని ప్రముఖ ఓటిటి మాధ్యమం సోని లివ్ వారు కొనుగోలు చేసారు. ఇక ఈ మూవీ వాస్తవానికి ఇవాళ సోని లివ్ ఆడియన్స్ ముందుకు రావాల్సింది, అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా మరొక వారం పాటు వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. ఏజెంట్ కోసం ఎదురు చూసిన అక్కినేని ఫ్యాన్స్, ఆడియన్స్ కి ఈ న్యూస్ ఒకింత నిరాశ కలిగించినప్పటికీ అతి త్వరలో మూవీని అందిస్తాం అని కొద్దిసేపటి క్రితం సోని లివ్ వారు ఒక ట్వీట్ ద్వారా తెలిపారు.

Exit mobile version