సమీక్ష : సత్తి గాని రెండెకరాలు – ఆహా లో తెలుగు సినిమా

Sathi Gani Rendu Ekaralu Movie Review In Telugu

విడుదల తేదీ : మే 26, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: జగదీష్ ప్రతాప్, వెన్నెల కిషోర్, మోహన శ్రీ, అనీషా దామా, తాజ్ తిరందాస్, బిత్తిరి సత్తి, మురళీధర్ గౌడ్, మరియు మాస్టర్ రసూల్ తదితరులు

దర్శకులు : అభినవ్ దండా

నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్. వై

సంగీత దర్శకులు: జై క్రిష్

సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి

ఎడిటర్: అభినవ్ దండా

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

పుష్ప మూవీలో కేశవగా తన నటనతో అందరినీ ఆకట్టుకున్న జగదీశ్ ప్రతాప్ తాజాగా ప్రధాన పాత్రలో నటించిన సినిమా సత్తి గాని రెండెకరాలు. అభినవ్ దండా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి దీని సమీక్ష ఇప్పుడు చూద్దాం.

 

కథ :

సత్తి (జగదీష్ ప్రతాప్) తన భార్య అందమ్మ (మోహన శ్రీ) మరియు అతని ఇద్దరు పిల్లలతో కొల్లూరులో నివసిస్తుంటాడు. ఆటోడ్రైవర్ అయిన అతడికి జీవితంలో మిగిలింది రెండెకరాల భూమి మాత్రకి. దురదృష్టవశాత్తు, అతని కుమార్తెకు గుండె సమస్య తలెత్తడంతో తన ఆపరేషన్ కోసం భారీగా డబ్బులు అవసరం అవుతాయి. దానితో వేరే మార్గం లేక సత్తి తన భూమిని విక్రయించాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఒక రోజు అతనికి విలువైన రాళ్లతో కూడిన ఒక బ్రీఫ్‌కేస్ దొరుకుతుంది. సత్తి తన స్నేహితుడైన అంజి (రాజ్ తిరందాస్) అనే దొంగను ఆ సూట్ కేసు లోని రాళ్లను అమ్మడానికి సహాయం చేయమని అడుగుతాడు. మరి ఆ తరువాత ఏం జరిగింది? అసలు ఈ విలువైన రాళ్ల యజమాని ఎవరు? సత్తి తన కూతురి ప్రాణాలు కాపాడాడా ? ఇటువంటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానం దొరకాలి అంటే సత్తి గాని రెండెకరాలు చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

తన కూతురికి ఆపరేషన్ కోసం డబ్బుల కోసం పాకులాడే వ్యక్తిగా జగదీష్ ప్రతాప్ ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని లుక్స్ మరియు బాడీ లాంగ్వేజ్ బాగున్నాయి, మరియు అతను సినిమా అంతటా చాలా సహజంగా నటించాడు. ఇక వెన్నెల కిషోర్ కూడా తన కామిక్ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని అలరించాడు. మోహన శ్రీ, అనీషా దామా, తాజ్ తిరందాస్ తమ తమ పాత్రల్లో డీసెంట్‌గా నటించారు. ఇక సినిమా యొక్క ఫస్ట్ హాఫ్ లో కొన్ని మంచి సీన్స్ మరియు కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి అనుభూతిని కలిగిస్తుంది మరియు మ్యూజిక్ డైరెక్టర్ ఈ విషయమై చక్కని అవుట్ పుట్ అందించారు.

 

మైనస్ పాయింట్స్ :

కాకపోతే మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకున్నప్పటికీ పేలవమైన రచన కారణంగా ఓవరాల్ గా ఈ సినిమా ఆకట్టుకోదు. కథలో అలరించేలా సాగడానికి తగినంత అంశాలు ఉన్నప్పటికీ దర్శకుడు మరింత బలంగా కథనం మాత్రం రాసుకోలేదు. ప్రేక్షకులను నవ్వించే కొన్ని మంచి సరదా సీన్స్ ఉన్నాయి, కానీ సినిమా ముందుకి నడుస్తున్నకొద్దీ వినోదం తగ్గుతూనే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ పూర్తిగా బోరింగ్ సన్నివేశాలతో నిండిపోయింది మరియు ఇక్కడే సినిమా పూర్తిగా రాంగ్ ట్రాక్ లోకి వెళ్లిపోయింది. కొన్ని సన్నివేశాలు మనల్ని అలరించవు సరికదా అవి కథకి ఏమాత్రం బలాన్ని కూడా అందించవు. ఇంకా పెద్ద లోపం ఏమిటంటే క్లైమాక్స్ చాలా పేలవంగా ఉండడం. ఈ సినిమాలో మరో పార్ట్ ఉంటుందని చెప్పినప్పటికీ మొదటి పార్ట్ సినిమా ముగించిన విధానం చాలా నిరాశపరిచింది. ఇది ఒకరకంగా ఆడియన్స్ కి అసంపూర్ణ అనుభూతిని ఇస్తుంది.

 

సాంకేతిక వర్గం :

జయ్ క్రిష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫ్రెష్ గా ఉండడంతో పాటు మంచి మూడ్‌ని ఇస్తుంది. విశ్వనాథ్ రెడ్డి కెమెరా పనితనం, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ అయితే పర్వాలేదు. హాస్యాన్ని అందించే కొన్ని డైలాగులు చక్కగా రాశారు. ఇక రచయిత మరియు దర్శకుడు అభినవ్ దండా విషయానికి వస్తే, అతను సినిమాతో ఓవరాల్ గా పర్వాలేదనిపించాడు. అతని కథలో కామెడీని మరియు థ్రిల్‌ ను అందించడానికి మంచి సామర్థ్యం ఉన్నప్పటికీ సినిమా కొన్ని భాగాలలో మాత్రమే వినోదాన్ని పంచుతుంది. మేకర్స్ సెకండ్ హాఫ్ మరియు క్లైమాక్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే, సినిమా నవ్వులతో కూడిన థ్రిల్లర్ గా ఆకట్టుకునేది.

 

తీర్పు :

మొత్తంగా చెప్పాలి అంటే సత్తిగాని రెండెకరాలు సినిమా కొంతమేరకు వినోదాన్ని అందిస్తుంది. నటుడు జగదీష్ ప్రతాప్ ఆకట్టుకునే పెర్ఫార్మన్స్, వెన్నెల కిషోర్ కామిక్ సీస్ దీనికి బలం అని చెప్పాలి. కానీ స్క్రీన్ ప్లే సినిమాను నెక్స్ట్ లెవెల్ కి చేరుకోనివ్వలేదు. అందుకే సత్తిగాని రెండు ఏకరాలు ఈ వారాంతంలో వన్ టైం వాచ్ మూవీగా మిగులుతుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version