సమీక్ష : “విమానం” – స్లో గా సాగే డీసెంట్ ఎమోషనల్ డ్రామా

Vimanam Movie Review In Telugu

విడుదల తేదీ : జూన్ 09, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, అనసూయ భరద్వాజ్, మాస్టర్ ధ్రువన్, మీరా జాస్మిన్, ధనరాజ్, రాజేంద్రన్

దర్శకులు : శివ ప్రసాద్ యానాల

నిర్మాతలు: కిరణ్ కొర్రపాటి & జీ స్టూడియోస్

సంగీత దర్శకులు: చరణ్ అర్జున్

సినిమాటోగ్రఫీ: వివేక్ కాలెపు

ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో సముద్రఖని, అనసూయ భరద్వాజ్ అలాగే రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కొత్త దర్శకుడు శివప్రసాద్ యణల తెరకెక్కించిన బై లాంగ్వేజ్ చిత్రం “విమానం” కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష లో తెలుసుకుందాం రండి.

 

 

కథ :

ఇక కథ లోకి వస్తే..వీరయ్య(సముద్రఖని) ఓ దివ్యాంగుడు కాగా తాను హైదరాబాద్ లో ఓ చిన్న స్లమ్ ఏరియాలో అయితే తన కొడుకు రాజు(మాస్టర్ ధృవన్) తో అయితే చిన్నపాటి లైఫ్ కొనసాగిస్తూ ఉంటాడు. మరి వీరయ్య తమ పొట్టకూటి కోసం ఓ చిన్నపాటి సులబ్ కాంప్లెక్స్ ను రన్ చేసుకోగా తన కొడుకు రాజు ఎప్పటికైనా విమానం ఎక్కాలని కలలుగంటాడు. అయితే ఇదే క్రమంలో రాజు కోసం వీరయ్య ఓ షాకింగ్ అంశం తెలుసుకుంటాడు. మరి అదేంటి? సినిమాలో అనసూయ పాత్ర ఏంటి అనే ఇతర అంశాలు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో చాలానే సినిమాలు ఉండొచ్చు కానీ తండ్రి కొడుకు లేదా తండ్రి కూతుళ్ళ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు కాస్త సున్నితంగా అనిపిస్తాయి. అలాంటి ఓ తండ్రి కొడుకుల ఎమోషనల్ సినిమానే ఈ “విమానం”. అయితే ఈ చిత్రంలో పలు చోట్ల బ్యూటిఫుల్ ఎమోషన్స్ కనిపిస్తాయి.

నటుడు సముద్రఖని అయితే తన పాత్రలో ఒదిగిపోయారు. బిలో మిడిల్ క్లాస్ తండ్రిగా తన కొడుకు కోసం ఆరాటపడే నాన్నగా అద్భుతమైన పెర్ఫామెన్స్ ని అందించారు. అలాగే తన కొడుకు రాజుగా కనిపించిన చిరు నటుడు మాస్టర్ ధృవన్ చక్కని నటన కనబరిచాడు. మెయిన్ గా ఈ ఇద్దరి నడుమ సన్నివేశాలు అయితే కదిలిస్తాయి.

ఇక మరో ముఖ్య పాత్రలో నటించిన అనసూయ తన రోల్ లో అయితే మెరిసారని చెప్పాలి. ఓ వ్యభిచారిణిగా కనిపించిన ఆమె తన నటనతో తన పాత్రలో ఉండే హావభావాలను చక్కగా పండించారు. అలాగే రాహుల్ రామకృష్ణ, ధనరాజ్, మీరాజాస్మిన్ లాంటి నటులు తమ పాత్రలకి న్యాయం చేకూర్చారు. అలాగే సినిమాలో కొన్ని సాంగ్స్ బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

జెనరల్ గా ఎక్కువశాతం ఇలాంటి ఎమోషనల్ డ్రామాలలో స్లో నరేషన్ నే ఎక్కువ కనిపిస్తుంది. మరి ఇది ఈ సినిమాలో కూడా రిపీట్ అయ్యింది. కాస్త స్లో గా సినిమా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే స్క్రీన్ ప్లే ని అయితే దర్శకుడు ఇంకాస్త మెరుగ్గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది.

ఇంకా కొన్ని పాత్రలకి అయితే మంచి ఇంపార్టెన్స్ మిస్ అయ్యినట్టుగా అనిపిస్తుంది. అలాగే దర్శకుడు కొన్ని చోట్ల కామెడీ ట్రాక్ ని పెట్టి నవ్వించే ప్రయత్నం చేసాడు కానీ అది అంతగా వర్కౌట్ అయ్యినట్టు అనిపించదు.

మెయిన్ గా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలకి కనిపించే కామెడీ సీన్స్ కి పొంతన కుదరదు. రాజేంద్రన్ పై చూపించే సీన్స్ ఒకింత చికాకు తెప్పిస్తాయి. ఇక మరో నటులు రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ లపై అయితే మరిన్ని ఎమోషనల్ సీన్స్ కి ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది కూడా యాడ్ చేసి ఉంటే బాగుండేది.

 

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు అయితే ఎక్కడా కాంప్రమైజ్ అయ్యినట్టుగా అనిపించదు. అలాగే టెక్నీకల్ టీం లో చరణ్ అర్జున్ మ్యూజిక్ సినిమాకి సోల్ అని చెప్పొచ్చు. తన స్కోర్, సాంగ్స్ బాగున్నాయి. అలాగే వివేక్ సినెమాటోగ్రఫి బాగుంది. అలాగే మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది కానీ ఇంకా బెటర్ గా చేయాల్సింది.

ఇక డెబ్యూ దర్శకుడు శివప్రసాద్ యణల ఓ నీట్ స్టోరీతో అయితే ఆకట్టుకునే ప్రయత్నాన్ని హర్షించవచ్చు. అయితే ఇంకా కొంచెం మంచి స్క్రీన్ ప్లే తో కథనాన్ని రన్ చేసి ఉంటే బాగుండేది. నటీనటులు నుంచి తాను అయితే మంచి పెర్ఫామెన్స్ లను అందివ్వడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “విమానం”. తండ్రీ కొడుకులపై ఓ ఎమోషనల్ రైడ్ గా ఉంటుంది. కాకపోతే ఫుల్ లెంగ్త్ ఎంగేజింగ్ గా ఉండదు కానీ అక్కడక్కడా డీసెంట్ ఎమోషన్స్ తో ఆకట్టుకుంటుంది. నటుడు సముద్రఖని, మాస్టర్ ధృవన్ అనసూయ లు తన పాత్రల్లో షైన్ అయ్యారు. కొంచెం స్లో గా ఉండి ఓ డీసెంట్ ఎమోషనల్ డ్రామాని చూడాలి అనుకునేవారు అయితే ఈ వారాంతంలో ఈ చిత్రాన్ని ఓసారి చూడవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version