ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “కస్టడీ”.!


అక్కినేని యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతి సనన్ హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “కస్టడీ”. తెలుగు సహా తమిళ్ లో కూడా ఏకకాలంలో తెరకెక్కి రిలీజ్ అయ్యిన ఈ చిత్రం అయితే రెండు భాషల్లో కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. ఇక దీనితో ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూసిన ఆడియెన్స్ కి అయితే ఫైనల్ గా ఆ బిగ్ డే వచ్చేసింది.

ఈ చిత్రం ఈరోజు నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి అవుతుంది. ఒరిజినల్ తెలుగు. తమిళ్ సహా మలయాళ కన్నడ భాషల్లో డబ్ అయ్యి అయితే మొత్తం నాలుగు భాషల్లో ఈ చిత్రం ఇపుడు అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా అరవింద స్వామి, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Exit mobile version