తన తొలి ప్రొడక్షన్ విడుదల తేదీని లాక్ చేసిన కంగనా రనౌత్


బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ప్రస్తుతం రాఘవ లారెన్స్‌తో కలిసి నటిస్తున్న తమిళ చిత్రం చంద్రముఖి 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తను తొలి నిర్మాణం వహిస్తున్న విడుదల తేదీని తాజాగా ప్రకటించింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ మరియు అవ్నీత్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించిన టికు వెడ్స్ షేరు జూన్ 23, 2023న నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నట్లు కంగనా రనౌత్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

మణికర్ణిక ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆమె ఈ చిత్రాన్ని నిర్మించింది. సాయి కబీర్ దర్శకత్వం వహించిన టికు వెడ్స్ షేరులో ఖుషీ భరద్వాజ్ కూడా ఒక ప్రముఖ పాత్రలో నటించారు. కంగనా రనౌత్ తదుపరి దర్శకత్వ వెంచర్, ఎమర్జెన్సీ కూడా అదే బ్యానర్‌ పై నిర్మించడం గమనించదగ్గ విషయం.

Exit mobile version