ప్రభాస్ మరియు కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా పాన్ ఇండియన్ చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలైంది, అయితే మెజారిటీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది ఈ సినిమా. వాస్తవానికి ఆగస్ట్‌లో ఈ సినిమా OTT రిలీజ్ కానున్నట్లు తెలిసిందే. కాకపోతే అనుకున్న టైమ్ కంటే ముందుగా రిలీజ్ చేయాలని ఆదిపురుష్ మేకర్స్ నిర్ణయించుకున్నారని సోషల్ మీడియాలో ఒక పుకారు వ్యాపిస్తోంది.
అయితే, ఆ పుకార్లు అవాస్తవం అని తెలుస్తోంది. డిజిటల్ డెబ్యూ ప్లాన్‌లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. టి-సిరీస్ మరియు రెట్రోఫిల్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ బిగ్గీలో సైఫ్ అలీ ఖాన్, దేవదత్తా నాగే, సన్నీ సింగ్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.