సమంత ఏడాది బ్రేక్..డీటెయిల్స్ ఇవే!

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గానే “శాకుంతలం” చిత్రంతో అయితే పలకరించగా ఈ చిత్రం భారీ ప్లాప్ అయ్యింది. మరి ఈ చిత్రం అనంతరం ఇప్పుడు సామ్ “ఖుషి” అలాగే ప్రైమ్ వీడియో సెన్సేషనల్ సిరీస్ “సిటాడెల్” లతో అయితే ఇపుడు బిజీగా ఉంది. మరి తన ప్రొఫిషినల్ లైఫ్ లో బిజీగా ఉన్న సమంత లేటెస్ట్ గా అయితే తన పర్శనల్ లైఫ్ లో ఏడాది వరకు బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యిందట.

అయితే సమంత ఇప్పుడు ఈ ఏడాది బ్రేక్ ని ఖుషి, అలాగే సిటాడెల్ సిరీస్ కంప్లీట్ అయ్యాక తీసుకోనుండగా ఈ గ్యాప్ లో తన హెల్త్ పై కేర్ తీసుకోనుంది అని తెలుస్తుంది. సమంత గత కొన్నాళ్లుగా మాయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దానికి ఆమె చికిత్స కూడా తీసుకుంటుంది. అయితే ఈ ట్రీట్మెంట్ కోసమే ఇపుడు సమంత ఏడాది బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యిందట. ఆ ట్రీట్మెంట్ అయ్యాకే మిగతా ప్రాజెక్ట్ లు ఓకే చేస్తుంది అని లేటెస్ట్ సమాచారం.

Exit mobile version