సమీక్ష : స్వామి రారా – ఓ సారి చూడదగిన డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్

విడుదల తేదీ : 23 మార్చి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకుడు : సుదీర్ వర్మ
నిర్మాత : చక్రీ చిగురుపతి
సంగీతం : సన్నీ
నటీనటులు : నిఖిల్, స్వాతి, పూజ రామచంద్రన్..

శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్’ సినిమాతో పరిచయమైన హీరో నిఖిల్ కు ఆ సినిమా తరువాత ఏ సినిమా కూడా ఇంతవరకు అంతమంచి పేరును తేలేదు. ఇప్పుడు నిఖిల్, స్వాతితో కలిసి సుదీర్ వర్మ దర్శకత్వంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘స్వామి రారా’ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా ట్రైలర్స్, మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

కథ :

ఈ సినిమా బాగా ఫేమస్ అయిన తిరువనంతపురంలోని పద్మనాభస్వామి గుడిలోని అత్యంత మహిమ గల గణేష్ విగ్రహాన్ని దొంగలించడంతో మొదలవుతుంది. ఈ విగ్రహం విలువ ఎంత అనేది లెక్కకట్టడంలేదు. ఈ విగ్రహం ఒకరి చేతిలో నుండి మరొకరి చేతిలోకి మారుతూ వుంటుంది. అలా నిధానంగా గ్యాంగ్ స్టర్స్ కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. ప్రతి ఒక్కరు ఈ విగ్రహాన్ని ఒకరి దగ్గర నుంచి ఒకరు దొంగిలించి అమ్మడానికి ప్రయత్నిస్తూ వుంటారు. ఇదిలా ఉండగా సూర్య(నిఖిల్) ఒక జేబు దొంగ, తనతో పాటు మరో ముగ్గురు వుంటారు. వారు బ్రతకడం కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వుంటారు.

ఒకరోజు అనుకోకుండా సూర్య, జర్నలిస్ట్ గా పని చేస్తున్న స్వాతి(స్వాతి)ని కలుసుకుంటాడు. వీరు మంచి ప్రెండ్స్ గా మారుతారు. గ్యాంగ్ స్టర్స్ దగ్గర గల గణేష్ విగ్రహం చేతులు మారుతూ మారుతూ అనుకోకుండా స్వాతి హ్యాండ్ బ్యాగ్ లోకి చేరుతుంది. ఈ విషయం గ్యాంగ్ స్టర్(రవి బాబు) కి తెలుస్తుంది. ఈ విగ్రహం కోసం రవిభాబు స్వాతి, సూర్యల వెంట పడతాడు. ఈ గ్యాంగ్ స్టర్ నుండి సూర్య, స్వాతి ఎలా బయట పడ్డారు? చివరికి ఆ విగ్రహం ఏమవుతుంది? అన్న సస్పెన్స్ ని తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమా విసువల్స్ చాలా స్టైలిష్ గా చూడటానికి చాలా బాగున్నాయి. నిఖిల్ కొత్త లుక్ లో బాగున్నాడు. పూర్తిగా డైరెక్టర్ ఎలా చెబితే అలా చేశాడు. దొంగ పాత్రలో నిఖిల్ నటన బాగుంది. నిఖిల్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ చెప్పే విదానం, స్క్రీన్ పై అతని లుక్ ఈ సినిమాలో చాలా మెరుగుపరుచుకున్నాడు . ఎప్పటిలాగే స్వాతి ఈ సినిమాలో చక్కగా నటించింది, అలాగే ఆమె బబ్లీ లుక్ బాగుంది .

రవిబాబు గ్యాంగ్ స్టర్ పాత్రకు తగినట్టుగా చాలా ఈజీగా నటించాడు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా సాగిపోతుంది. కథ చాలా బాగుంది. ఈ సినిమా ప్రారంభంలో జోగి బ్రదర్స్ ట్రాక్ బాగుంది. స్వామి రారా సినిమా రియాలిటీ ఫీల్ ని కలుగ చేసే సినిమా, అలాగే మన లక్ష్యాలను చేరుకోవడం కోసం అడ్డదార్లు తొక్కకూడదు అని చెబుతుంది. పూజ కుమార్(పిజ్జా ఫేం) మరియు జీవాలు తమ పాత్రలో బాగా నటించారు.

మైనస్ పాయింట్స్ :

కొన్ని సన్నివేశాలను చూస్తుంటే సినిమా ఫ్లోని తగ్గించినట్టుగా అనిపిస్తుంది. ప్రత్యేకంగా సెకండాఫ్. ఈ సినిమా కాస్త వేగవంతంగా ఉండడం కోసం కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉండాల్సింది.
అవసరం లేని కొన్నిసన్నివేశాలు, చేజింగ్ సీన్స్ ఈ సినిమాకి మైనస్ గా చెప్పవచ్చు. క్లైమాక్స్ సన్నివేశాలను ఇంకాస్త చక్కగా చిత్రీకరించి వుంటే భాగుండేది. సెకండాఫ్ లో కామెడీ సీన్స్ ఏమీ లేకపోవడంతో ప్రేక్షకునికి కొన్ని సీన్స్ కాస్త చిరాకు కలిగిస్తాయి. ఇది సినిమాపై వున్న మంచి అబిప్రాయాన్ని చెడగొడుతుంది.

ఈ సినిమా ఎ సెంటర్స్, మల్టీప్లెక్స్ లలో చూసే వారికి నచ్చుతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే బి, సి సెంటర్స్ తెలుగు సినిమా అభిమానులను ఈ సినిమా కాస్త నిరాశపరచవచ్చు.


సాంకేతిక విభాగం :

‘స్వామి రారా’ ఫ్రెష్ లుక్ తో, మంచి సాంకేతిక విలువలతో నిర్మించిన సినిమా. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అధ్బుతంగా వుంది. స్లో మోషన్ లో చిత్రీకరించిన సన్నివేశాలు చాలా స్టైల్ గా వున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధాన హైలెట్. ఇది చాలా కొత్తగా, సినిమాకి సపోర్ట్ గా బాగుంది. మ్యూజిక్ మాములుగా ఉంది. సినిమా మొదటి టైటిల్ ట్రాక్ చాలా బాగుంది, చాలా చక్కగా షూట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ మ్యూజిక్ బాగుంది.

సుదీర్ వర్మ దర్శకత్వం బాగుంది. తను తన పనిని చక్కగా నిర్వహించాడు. సెకండాఫ్ ని ఇంకాస్త బాగా తీసి ఉంటే ఈ సినిమా అద్బుతమైన విజయాన్ని సాదించేది.

తీర్పు :

అందరికీ నచ్చే విధంగా ఒక చక్కని క్రైమ్ థ్రిల్లర్ స్టోరీతో నిర్మించిన సినిమా ‘స్వామి రారా’. వినూత్నమైన కొన్ని సన్నివేశాలు, మంచి విసువల్స్ మరియు కొన్ని ఆసక్తికరమైన సీన్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. నిదానంగా సినిమా ఉండడం, అనుకున్న రీతిలో క్లైమాక్స్ లేకపోవడం ఈ సినిమాకి మైనస్. స్వామి రారా ఓ సారి చూడదగిన సినిమా..

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

అనువాదం : నగేష్ మేకల

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version