సమీక్ష : “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” – కొన్ని నవ్వులు మాత్రమే

Annapurna Photo Studio Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 21, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: చైతన్య రావు, లావణ్య సాహుకార, లలిత్ ఆదిత్య, వివా రాఘవ, ఉత్తర రెడ్డి, మిహిర గురుపాదప్ప, యష్ రంగినేని, వాసు ఇంటూరి, కృష్ణ మోహన్, రమణ

దర్శకుడు : చందు ముద్దు

నిర్మాత: యష్ రంగినేని

సంగీతం: ప్రిన్స్ హెన్రీ

సినిమాటోగ్రఫీ: పంకజ్ తొట్టాడ

ఎడిటర్: డి వెంకట్ ప్రభు

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఈ వారం థియేటర్లు లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ అయ్యిన ఓ చిన్న చిత్రం “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే..చంటి(చైతన్య రావు) కపిలేశ్వరపురం అనే చిన్న గ్రామంలో ఓ వీడియోగ్రాఫర్ కాగా తన చిన్నపాటి జీవితాన్ని అయితే తన ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో అయితే సాఫీగా సాగిస్తుంటాడు. అయితే అక్కడ గౌతమి(లావణ్య సాహుకార) ని చూసి చంటి ప్రేమిస్తాడు. తరువాత ఆమె కూడా ప్రేమిస్తుంది. కానీ కొన్ని ఊహించని కారణాలతో అయితే చంటి ఆత్మహత్యా యత్నం చేస్తాడు. మరి తాను సడెన్ గా అలా చేసుకోడానికి కారణం ఏంటి? ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.

 

ప్లస్ పాయింట్స్ :

 

30వెడ్స్21 ఫేమ్ నటుడు చైతన్య రావు ఈ సినిమాలో డీసెంట్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు అని చెప్పాలి. తన కామెడీ టైమింగ్ అందులో అమాయకత్వం ఈ చిత్రంలో బాగున్నాయి. అలాగే హీరోయిన్ లావణ్య కూడా చక్కటి నటన కనబరిచింది. పలు సన్నివేశాల్లో సాలిడ్ పెర్ఫామెన్స్ తో సహా చక్కటి స్క్రీన్ ప్రెజెన్స్ తో అయితే ఆమె తనపై దృష్టి ఆకర్షిస్తుంది. ఇంకా వైవా రాఘవ్ కూడా తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటాడు.

ఇక ఈ చిత్రంలో మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ సినిమా నిర్మాత యష్ రంగినేని అని చెప్పాలి. తాను కూడా మంచి స్క్రీన్ తో మంచి నటనతో ఆకట్టుకున్నారు. వీరితో పాటలుగా తదితర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఇంప్రెస్ చేస్తారు. ఇక సినిమాలో ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా నాచురల్ గా మంచి విజువల్స్ విలేజ్ వాతావరణాన్ని చూపించింది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సినిమా కంప్లీట్ చేసాక అయితే ఆడియెన్స్ లో చిన్న కన్ఫ్యూజన్ అయితే నెలకొంటుంది. సినిమాలో చాలా సింపుల్ లైనే కనిపిస్తుంది. అలాగే ఫస్టాఫ్ లో కనిపించిన ఎంగేజింగ్ నరేషన్ అయితే సెకండాఫ్ లో మిస్ అయ్యినట్టుగా అనిపిస్తుంది. అలాగే చాలా వరకు నరేషన్ ని సాగదీతగా లాగినట్టుగా అనిపిస్తుంది.

ఇంకా పలు కామెడీ సీన్స్ విషయంలో అయితే దర్శకుడు మరింత కేర్ తీసుకోవాల్సింది. వీటితో పాటుగా పలు సన్నివేశాల్లో అయితే నరేషన్ చాలా వరకు ఊహాజనితంగానే ఉంటుంది. ఇక నటులు మహీరా గురుపడప్ప అలాగే లలిత్ ఆదిత్య కొందరి పాత్రలని ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. ఇంకా సినిమాలో మరికొంతమంది తెలిసిన నటీనటుల్ని పెట్టి ఉంటే కాస్త ఇంపాక్ట్ బాగుండేది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. అలాగే పైన చెప్పినట్టుగా ప్రొడక్షన్ డిజైన్ సినిమా సెట్ వర్క్స్ సహా నటీనటుల కాస్ట్యూమ్స్ వర్క్ బాగున్నాయి. ఇక సంగీతం, సినిమాటోగ్రఫీలు చిత్రంలో అయితే ఇంప్రెస్ చేస్తాయి. ఇక ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు చెందు విషయానికి వస్తే..స్క్రీన్ రైటర్ గా తాను సక్సెస్ అయినప్పటికీ దర్శకుడుగా మాత్రం ఇంకా బెటర్ వర్క్ చేయాల్సింది. మెయిన్ గా సెకండాఫ్ ని హ్యాండిల్ చేయడంలో అయితే దర్శకుడు తడబడ్డాడు. ఫస్టాఫ్ లానే సెకండాఫ్ కూడా మంచి నరేషన్ తో తీసి ఉంటే బెటర్ ఫీల్ సినిమాపై వచ్చి ఉండేది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” లో నటుడు చైతన్య రావు సహా హీరోయిన్ లావణ్యల సిన్సియర్ పెర్ఫామెన్స్ కనిపిస్తుంది. అలాగే వారితో పాటుగా సినిమాలో కొన్ని కామెడీ బ్లాక్స్ బాగుంటాయి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి కానీ సినిమా ఆద్యంతం ఎంటర్టైన్ చేసే విధంగా అయితే ఉండదు. జస్ట్ కొన్ని నవ్వులు వరకు మాత్రమే ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version