సమీక్ష : “హత్య” – స్లోగా సాగె రెగ్యులర్ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ !

Hatya Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 21, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: విజయ్ ఆంటోని, రితికా సింగ్, మీనాక్షి చౌదరి, రాదికా శరత్‌కుమార్, మురళీ శర్మ, సిద్ధార్థ శంకర్, కిషోర్ కుమార్ తదితరులు

దర్శకుడు : బాలాజీ కె కుమార్

నిర్మాత: ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ & లోటస్ పిక్చర్స్

సంగీతం: శివకుమార్ విజయన్

సినిమాటోగ్రఫీ: గిరీష్ గోపాలకృష్ణన్

ఎడిటర్: సెల్వ ఆర్కే

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ హత్య. మీనాక్షి చౌదరి ఒక ముఖ్య పాత్ర పోషించింది. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

లైలా (మీనాక్షి చౌదరి) ఓ మోడల్. ఆమెను ఎవరో హత్య చేస్తారు. ఆ హత్య కేసు ఐపీఎస్ అధికారిణి సంధ్య (రితికా సింగ్) విచారణ చేస్తూ ఉంటుంది. ఆమెకు వినాయక్ (విజయ్ ఆంటోని) హెల్ప్ చేస్తుంటాడు. ఇంతకీ, లైలాని ఎవరు చంపారు?, ఎందుకోసం చంపారు?, మొత్తం గందరగోళంగా ఉన్న లైలా హత్య కేసులో అసలు నిందుతుడు ఎవరు?, ఈ కేసును వినాయక్ ఎలా చేదించాడు ?, ఈ మధ్యలో రాదికా శరత్‌కుమార్, మురళీ శర్మ పాత్రలు ఏమిటి?, చివరకు లైలాని చంపిన వ్యక్తికి శిక్ష పడిందా? లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్:

 

ఈ హత్య సినిమాలో వచ్చే కొన్ని ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహకు అందలేదు. దర్శకుడు బాలాజీ కె కుమార్ రాసుకున్న క్రైమ్ డ్రామా కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్ గా సాగింది. ముఖ్యంగా సినిమాలో క్లైమాక్స్ ఆకట్టుకుంది. రితికా సింగ్ సీరియస్ పోలీస్ అధికారిణిగా ఆకట్టుకున్నారు. హీరోగా నటించిన విజయ్ ఆంటోని నటన అండ్ మేనరిజమ్ కూడా చాలా బాగున్నాయి.

క్రైమ్ అండ్ సీరియస్ సన్నివేశాల్లోని విజయ్ ఆంటోని నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. కథ రీత్యా హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్రకు అంత పెద్దగా నిడివి లేకున్నప్పటికీ ఆమె మెప్పించింది. రాదికా శరత్‌కుమార్ నటన కూడా బాగుంది. అలాగే, మురళీ శర్మ, సిద్ధార్థ శంకర్, కిషోర్ కుమార్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు ఓ హత్య చుట్టూ అనేక కోణాల్లో సినిమాని నడిపిన విధానం కొన్ని చోట్ల బాగుంది.

 

మైనస్ పాయింట్స్:

 

ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్నా.. కొన్ని చోట్ల ప్లే సింపుల్ గా సాగుతుంది. అలాగే గుడ్ పాయింట్ అండ్ కంటెంట్ ఉన్నా.. మెయిన్ ప్లాట్ కూడా సింపుల్ గా ఉంది. అలాగే హత్య చేసిన విలన్ ట్రాక్ కూడా బాగాలేదు. ఈ ట్రాక్ ఇంకా బలంగా ఉండాల్సింది. అదేవిధంగా విలన్ గా నటించిన నటుడు సిద్దార్థ్ శంకర్ కూడా ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ కాలేదు.

దీనికి తోడు విలన్ చేసే హత్య తాలూకు మోటివ్ కూడా పూర్తి సినిమాటిక్ గా ఉంది. మొత్తానికి మేకర్స్ తాము అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. కొన్ని సీన్స్ విషయంలో అసలు బాగాలేదు. అలాగే ఫస్ట్ హాఫ్ లో సన్నివేశాలు కూడా ఆకట్టుకోవు. పైగా హీరో ట్రాక్ కూడా బలహీనంగా సాగుతోంది. దీనికితోడు నాటకీయత ఎక్కువడంతో సినిమాలో సహజత్వం లోపించింది.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు బాలాజీ కె కుమార్ మంచి క్రైమ్ థ్రిల్లర్స్ కి గుడ్ ట్రీట్మెంట్ ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. విలన్ ట్రాక్ ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా నేచురల్ గా చూపించారు. సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

 

తీర్పు :

 

విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కొన్ని చోట్ల థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పర్వాలేదు అనిపించింది. అయితే, స్క్రీన్ ప్లే, విలన్ ట్రాక్ అండ్ హత్య తాలూకు మోటివ్ ఇంకా బెటర్ గా రాసుకొని ఉండి ఉంటే బాగుండేది. మొత్తమ్మీద ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించలేకపోయింది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version