లేటెస్ట్..సడెన్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసిన నిఖిల్ “స్పై”.!

మన టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా దర్శకుడు గ్యారీ బి హెచ్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమే “స్పై”. మరి గత నెల రిలీజ్ అయ్యిన ఈ చిత్రం నిఖిల్ కెరీర్ లో భారీ ఓపెనింగ్స్ ని అందుకుంది కానీ సరైన హోల్డ్ ని అయితే కొనసాగించ లేకపోయింది. ఇక దీనితో నెమ్మదిగా సినిమా వసూళ్లు తగ్గిపోయాయి.

అయితే ఇప్పుడు ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న ప్రైమ్ వీడియోలో తెనుగు సహా అన్ని పాన్ ఇండియా భాషల్లో ఇప్పుడు అందుబాటులో ఉంది. మరి అప్పుడు మిస్ అయ్యి చూడాలి అనుకునే వారు ఇప్పుడు చూడవచ్చు. ఇక ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా ఈడీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version