తమిళ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మళయాళ మెగాస్టార్ మోహన్ లాల్ అలాగే కన్నడ స్టార్ నటుడు శివ రాజ్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన సాలిడ్ యాక్షన్ డ్రామా “జైలర్” కోసం తెలిసిందే. మరి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం లేని అంచనాలు సృష్టించి రజిని కెరీర్ లో సిసలైన కం బ్యాక్ హిట్ గా అయితే నిలిచింది.
ఇక ఈ చిత్రం ఇప్పటికీ భారీ రన్ తో కంటిన్యూ అవుతుండగా ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ బజ్ అయితే ఒకటి ఆసక్తిగా మారింది. మేకర్స్ నిజానికి ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఓటిటి లో రిలీజ్ చేసే ప్లాన్ చేశారు కానీ పలు కారణాల చేత అయితే కాస్త ముందే అంటే ఈ సెప్టెంబర్ 7 నుంచే ఓటిటి లో రిలీజ్ చేయాలనీ డిసైడ్ చేసినట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఇక దీనిపై అధికారిక క్లారిటీ కూడా రావచ్చని టాక్. మొత్తానికి అయితే థియేటర్స్ లో బాగానే రన్ అవుతున్న ఈ సినిమా ఇంత తొందరగా స్ట్రీమింగ్ అంటే స్వల్పంగా ఎఫెక్ట్ చూపించవచ్చు. అయితే ఈ సినిమా ఓటిటి రైట్స్ సినిమా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారి సంస్థ సన్ నెక్స్ట్ వారే తీసుకున్నారు.