మెగాస్టార్ సినిమాలో నయనతార ?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ దర్శకుడు వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు ఈ పాత్రలో నయనతార నటించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని.. ఈ పాత్రలో నయనతార తీసుకుంటున్నారని టాక్. ప్రస్తుతం జవాన్ సక్సెస్ జోష్ లో ఉన్న నయనతార మరి మెగా 157లో కూడా నటిస్తోందో? లేదో? చూడాలి.

అన్నట్టు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, సోషియో ఫాంటసీ డ్రామా గా తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించనున్నారు. పైగా ఈ కథలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా హైలైట్ గా ఉంటుందట. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో వశిష్ట ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట.

Exit mobile version