సికిందరాబాద్ : సెప్టెంబర్ 21
దైవీయ స్పృహతో సాధన చేస్తూ , మహాక్షేత్రాల దర్శనం చేస్తూ అపురూప గ్రంధాలు రచించి, సంకలనం చేసి … ఉపాసనా సిద్ధత్వంతో మనకు అందిస్తున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఈ సంవత్సరం కూడా మంత్రరూప వ్రత వ్యాఖ్యాన వైభవంగా అందించిన శ్రీవర సిద్ధివినాయక మహాగ్రంధం ” విఘ్నరాజం భజే ” దివ్య గ్రంధం వినాయక విజ్ఞాన వైభవ గ్రంధంగా సాక్షాత్కరించిందని ఆబాలగోపాలం పురాణపండ శ్రీనివాస్ పై అభినందన జల్లులు వర్షిస్తున్నారు.
ఈ వినాయక చవితి సందర్భంగా భక్తిజ్ఞాన సంస్కారంతో అద్భుతంగా రచించి, సంకలనీకరించి, ప్రచురించిన ఈ మహిమోపేత గ్రంధాన్ని తెలుగురాష్ట్రాలలో వేలకొలది వినాయక మంటపాలు, వినాయక ఆలయాలు , పండిత పామరులు అక్కున చేర్చుకుని ఈ ఔన్నత్యాన్ని వేనోళ్ళ పొగుడుతుండటం మన కన్నుల ఎదుటే కనిపిస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, వరంగల్, నిజామాబాద్ నగరాలలో ఈ గ్రంధం గణపతి తత్వంతో మారుమ్రోగుతోంది. సొంతడబ్బాలకు, స్వార్ధాలకు దూరంగా వుండే పురాణపండ శ్రీనివాస్ ఏ గ్రంధం విడుదల చేసినా తెలుగురాష్ట్రాలలో భారీగానే ప్రశంసల స్పందనలు వర్షిస్తాయి. అంతేకాదు … స్పాన్సర్స్ కూడా ఎక్కువగానే వస్తారు. ఇందుకు పవిత్రత, ప్రతిభ, నిస్వార్ధత , మానవత , దైవత్వంలే కారణం
ప్రతీ పేజీలో దేవతాశక్తిని దర్శింప చేసే పురాణపండ శ్రీనివాస్ శ్రేష్ఠత్వ శోభల ఈ గ్రంధాన్ని దర్శించిన పండితులు , పీఠాధిపతులు మహా గణపతికి పురాణపండ శ్రీనివాస్ మంత్రాసనం వేశారని , ఈయన గ్రంధాలు ఒక అలౌకికమైన దివ్య భావాల్ని ఆవిష్కరిస్తాయని అనుగ్రహపూర్వక సందేశాల్ని అందిస్తున్నారు. శ్రీనివాస్ పుస్తకాన్ని తాకగానే శరీరమంతా మహాగణేశుని అనుగ్రహ సౌందర్య ప్రవాహం ఉరకలెత్తుతుందని , ఏ మాలిన్యమూ అంటని ఆయన మనస్సే ఇన్ని వైభవోపేత గ్రంధాలను అందిస్తోందని రామకృష్ణ మఠాధిపతులు స్వామి జ్ఞానదానంద వందలమందిలో ప్రశంసించటమే పురాణపండకు గణపతి అపరిమిత శక్తుల అనుగ్రహంగానే చెప్పాలి.
ఏదేమైనా ఈ సంవత్సరం కూడా వందల ఆలయాలు , పారాయణ సేవామండళ్ళు , అర్చక ప్రముఖులు, వేల వ్యాపార సంస్థలు , తెలుగు రాష్ట్రాలలో కొందరు సినీ రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు పురాణపండ శ్రీనివాస్ గ్రంధాన్ని భుజాలకెత్తుకుంటున్నారంటే అంతా మాయాశక్తుల వజ్రగణపతి విశేష అనుగ్రహం పురాణపండ శ్రీనివాస్ పై ప్రసరించటమేనని చెప్పక తప్పదు. ముద్రణా చైతన్యం, భాషా సౌందర్యం, వ్యాఖ్యాన వైఖరీ దక్షత , మంత్రవిద్యల సమీకరణ ఇవన్నీ ఇందులో చూడాల్సిందే. చదవాల్సిందే. అక్షరాలనే అధిష్ఠానాలుగా పురాణపండ భావిస్తారు కాబట్టే దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా అందించిన మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్ ‘ ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో మొట్టమొదట పురాణపండ శ్రీనివాస్ ఫోటో పెట్టి మరీ శ్రీనివాస్ కి కృతజ్ఞతలు చెప్పించారు. శ్రీనివాస్ నిస్వార్ధ తపస్సుకు , ప్రతిభాచైతన్యానికి ఇది కాలం ఎత్తిన విజయ పతాకం.