సమీక్ష : అష్టదిగ్బంధనం – కొన్ని థ్రిల్స్ కోసం మాత్రమే

Matti Katha Movie Review In Telugu

విడుదల తేదీ :సెప్టెంబర్ 22, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: సూర్య భరత్ చంద్ర, విశిక కోట, మహేష్ రావుల్, రంజిత్ నారాయణ్ కురుప్, విశ్వేందర్ రెడ్డి, రోష్ని రజాక్, మణి పటేల్, నవీన్ కుమార్ గట్టు, తదితరులు

దర్శకుడు : బాబా పీఆర్

నిర్మాత: మనోజ్ కుమార్ అగర్వాల్

సంగీతం: జాక్సన్ విజయన్

సినిమాటోగ్రఫీ: బాబు కొల్లాబత్తుల

ఎడిటర్: సత్య గిడుతూరి

సంబంధిత లింక్స్: ట్రైలర్

బాబా పిఆర్ రచన, దర్శకత్వంలో వచ్చినటువంటి అష్టదిగ్బంధనం అనే చిన్న చిత్రం ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

 

కథ:

శంకర్ గౌడ్ (మహేష్ రావుల్), ఎమ్మెల్యే శ్రీ రాములు (విశ్వేందర్ రెడ్డి)కి నమ్మకం గా ఉండే సహాయకుడు. శంకర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటాడు. అయితే ఎమ్మెల్యే టికెట్ కోసం 50 కోట్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే శ్రీ రాములు, శంకర్ కి సవాల్ విసిరారు. 50 కోట్ల రూపాయలు సాధించడానికి, శంకర్ మరియు అతని టీమ్ గౌతమ్ సహాయం తో (సూర్య భరత్ చంద్ర) బ్యాంకును దోచుకోవాలని అనుకుంటారు. గౌతమ్ భార్య ప్రియ (విశిక కోట) వైద్య చికిత్స కోసం అత్యవసరంగా డబ్బు అవసరం ఉంటుంది. అందుకోసం వీరు ప్లాన్ చేశారు. బ్యాంకును దోచుకోవడంలో విజయం సాధించారా? గౌతమ్ ఎవరు? శంకర్ రాజకీయ నాయకుడయ్యాడా? అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి.

 

ప్లస్ పాయింట్స్:

సినిమా కథ మొదటి నుండి ఆసక్తికరంగా ఉంటుంది. మొదటి నుండి చివరి వరకు ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో సినిమా నిండి ఉంది. రైటర్, డైరెక్టర్ బాబా పీఆర్ సరైన టైమ్ లో సరైన ట్విస్టులు పెట్టి ఆకట్టుకున్నారు.

శంకర్‌గా మహేష్ రావుల్ అద్భుతమైన నటనను కనబరిచాడు. మంచి ఎక్స్ప్రెషన్స్ తో విలనిజాన్ని చూపించారు. చక్రి అనే పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా నటించిన రంజిత్ నారాయణ్ కురుప్ కూడా మంచి నటన తో ఆకట్టుకున్నారు.

లీడ్ యాక్టర్ సూర్య భరత్ చంద్ర సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సినిమాలోని ఇతర నటీనటులు తమ పాత్రలకి తగిన న్యాయం చేశారు.

 

మైనస్ పాయింట్స్:

సినిమా కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పటికీ, కొన్ని పాత చిత్రాలను గుర్తుకు తెస్తుంది ఈ సినిమా. ప్రేక్షకులను కట్టిపడేయడానికి దర్శకుడు చాలా ప్రయత్నం చేశారు. అయితే ఎలాంటి ల్యాగ్ లేకుండా ఉండే స్క్రీన్‌ ప్లే ఉండి ఉంటే బాగుండేది.

సినిమాలో మంచి నటీనటులు ఉండి ఉంటే బాగుండేది. ఈ క్రైమ్ డ్రామాను ఫేమస్ నటులు చేసి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. సినిమాలోని కొన్ని పాత్రలు వీక్ పెర్ఫార్మెన్స్ కారణంగా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో విఫలం అయ్యింది. వారి నటనా నైపుణ్యాలను మెరుగుపరచడానికి కొంత టైమ్ అండ్ మనీ ఇన్వెస్ట్ చేసి ఉంటే బాగుండేది.

సినిమాలో పాటలు అంతగా ఆకట్టుకోలేదు. ధియేటర్ లో నుండి బయటికి వెళ్ళిన తర్వాత సాంగ్స్ అంతగా గుర్తుకు కూడా రావు. సినిమాలోని డైలాగులు కూడా రొటీన్ గా అనిపిస్తాయి. ఇంకొంచెం క్రియేటివ్ గా రాసి ఉంటే బాగుండేది.

 

సాంకేతిక విభాగం:

రైటర్, డైరెక్టర్ బాబా పీఆర్ కథ, చెప్పే విధానం బాగుంది. అయితే సరైన స్క్రీన్ ప్లే కలిగి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. ట్విస్ట్ లు కూడా ఇంకా బాగుండే విధంగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రెజెంట్ చేసి ఉంటే ఆడియెన్స్ కి మంచి ఎక్స్ పీరియన్స్ అందించే అవకాశం ఉంది.

జాక్సన్ విజయన్ మ్యూజిక్, బాబూ కొల్లాబత్తుల సినిమాటోగ్రఫీ యావరేజ్ అని చెప్పాలి. వీరి సహాయ సహకారాలు ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేది. ఎడిటర్ సత్య గిడుతూరి ఫస్ట్ హాఫ్ మరియు సెకండ్ హాఫ్ లలో అనవసరమైన సన్నివేశాల్ని ట్రిమ్ చేసి ఉండాల్సింది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండే అవకాశం ఉంది.

 

తీర్పు:

మొత్తం మీద, అష్టదిగ్బంధనం ఒక ఆసక్తికరమైన కథతో కూడిన క్రైమ్ డ్రామా. అయితే స్క్రీన్ ప్లే కారణం గా సినిమా అంతగా ఆకట్టుకోదు. సూర్య భరత్ చంద్ర, మహేష్ రావుల్ మరియు రంజిత్ నారాయణ్ కురుప్ ల పర్ఫార్మెన్స్ లు బాగున్నాయి. కాకపోతే ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన వారి పర్ఫార్మెన్స్ అంతగా ఆకట్టుకోదు. అక్కడక్కడా సినిమా స్లో పేస్ లో సాగుతుంది. తక్కువ అంచనాలతో సినిమా కి వెళ్తే ఈ వీకెండ్ ఆస్వాదించవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version