‘వార్ 2’ పై లేటెస్ట్ అప్ డేట్

మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయికలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పై ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. డిసెంబర్ నుంచి ఈ సినిమా షాట్ స్టార్ట్ అవుతుందని.. ముందుగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ ల పై ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారని టాక్ నడుస్తోంది. మరి ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కాంబినేషన్ అంటే.. బాక్సాఫీస్ షేక్ అయినట్టే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

ఇక వార్ 2 కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. ఇది ఇద్దరి స్నేహితుల కథ అని, అర్జునుడు – కృష్ణుడు లా కలిసి ఉన్న ఇద్దరు స్నేహితులు.. చివరకు శత్రువులు గా మారితే ఎలా ఉంటుంది ? అనే కోణంలో ఈ సినిమా సాగుతుందట. ఏది ఏమైనా వార్ 2 అనేది యాక్షన్ ఫిల్మ్. మరి యాక్షన్ ఫిల్మ్ లో ఎన్టీఆర్ ఏ రేంజ్ నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version