గ్లోబల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ డ్రామా “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి వాటర్ బ్యాక్ డ్రాప్ లో ఒక పవర్ ఫుల్ వైలెంట్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తుండగా పాన్ ఇండియా లెవెల్లో అయితే ఈ సినిమాపై ఇప్పుడు మామూలు అంచనాలు అయితే లేవు. ఇక ఈ భారీ సినిమా ఓటిటి డీల్ పై అయితే ఇప్పుడు సాలిడ్ బజ్ వైరల్ గా మారింది.
ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులని అన్ని భాషలకి కలిపి దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనికి గాను వారు సుమారు 200 కోట్లకి పైగానే చెల్లించినట్టుగా తెలుస్తుంది. దీనితో మరి దేవరపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.