బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన రీసెంట్ చిత్రం “ఓ మై గాడ్ 2” కోసం అందరికీ తెలిసిందే. చాలా కాలం నుంచి అక్షయ్ కి సరైన హిట్ లేని సమయంలో అయితే ఈ చిత్రం వచ్చి మంచి హిట్ గా నిలిచింది. అప్పటికే తాను నటించి హిట్ అయ్యిన చిత్రం ఓ మై గాడ్ మొదటి భాగానికి ఇది సీక్వెల్ గా రావడం ఇది కూడా అంచనాలు అందుకోవడంతో అక్షయ్ కుమార్ మంచి హిట్ అందుకున్నాడు.
అయితే ఈ చిత్రం హిట్ టాక్ తో పాటుగా కొంతమేర కాంట్రవర్సీ కూడా మూటగట్టుకుంది. హిందూ దేవుళ్లపై కొన్ని సీన్స్ చాలా మందికి ఇబ్బందికరంగా అనిపించాయి. దీనితో కాంట్రవర్సీగా మారిన ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి లో రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఇక ఈ చిత్రం ఓటిటి హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈ అక్టోబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతానికి అయితే ఒక్క హిందీలోనే ఈ సినిమా అందులో విడుదల కానున్నట్టుగా తెలుస్తుంది.