సమీక్ష : “800” – కొన్ని ఎమోషన్స్ వరకు మాత్రమే

800 The Movie Review in Telugu

విడుదల తేదీ : అక్టోబరు 06, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: మధుర్ మిట్టల్, నాజర్, మహిమా నంబియార్, నరైన్, శరత్ లోహితస్వా మరియు ఇతరులు

దర్శకుడు : ఎం ఎస్ శ్రీపతి

నిర్మాత: వివేక్ రంగాచారి

సంగీతం: జిబ్రాన్

సినిమాటోగ్రఫీ: ఆర్డీ రాజశేఖర్

ఎడిటర్: ప్రవీణ్ కెఎల్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్రపై మధుర్ మిట్టల్ మెయిన్ లీడ్ లో నటించిన చిత్రం “800”. దర్శకుడు ఎం ఎస్ శ్రీపతి తెరకెక్కించిన ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి సక్సెస్ అయ్యిన చిత్రాల్లో నిలిచిందా లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

ఇక ఈ చిత్రం కథలోకి వస్తే..1940 అంతకు ముందే క్రికెట్ పుట్టిన సమయంలో అది అనేక దేశాలకి ఆంగ్లేయుల చేత విస్తరిస్తూ వస్తున్నా సమయంలో తమిళనాడుకి చెందిన కొందరు వలసదారులు వలసలో భాగంగా శ్రీలంకలో స్థిరపడతారు. అలా స్థిరపడిన వారిలో ముత్తయ్య మురళీధరన్ కుటుంబం కూడా ఒకటి. మరి శ్రీలంకలో కూడా విస్తరించిన ఈ క్రికెట్ ని చిన్న నాటి నుంచి చూస్తూ ఆసక్తి పెంచుకున్న ముత్తయ్య మురళీధరన్(మధుర్ మిట్టల్) అసలు క్రికెట్ లోకి ఎలా ఎంటర్ అయ్యాడు? తమిళ వాడు అయిన తాను శ్రీలంక జట్టుకి ఎందుకు కట్టుబడి ఉంటాడు? తన ఎదుగుదలలో తనకి ఎదురయిన సవాళ్లు తన పర్శనల్ లైఫ్ లోని తన క్రికెట్ పరంగా కూడా ఏమన్నా ఉన్నాయా? తాను సరిగ్గా 800 వికెట్ల తోనే ఎందుకు రిటైర్ అయ్యారు. అనే పలు ఆసక్తికర ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో మెయిన్ ప్లస్ పాయింట్ ముత్తయ్య పాత్రలో కనిపించిన మధుర్ మిట్టల్ కోసం చెప్పుకోవాలి. తాను ఈ పాత్రకి పర్ఫెక్ట్ క్యాస్టింగ్ అని చెప్పవచ్చు. అంతే కాకుండా ఈ పాత్రలో అయితే తాను ఒదిగిపోయాడు. ఎమోషన్స్ ని అన్ని రకాల హావా భావాలను కూడా చక్కగా డెలివర్ చేశారు.

అంతేకాకుండా సినిమాలో సెకండాఫ్ లోని డెప్త్ కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బావున్నాయి. అలాగే వీటితో పాటుగా మురళీధరన్ లైఫ్ లో చాలా వరకు కొందరికి తెలీని పాయింట్స్ కొందరికి తెలుస్తాయి. అలాగే వాటిని దర్శకుడు బాగా ప్రెజెంట్ చేశారు. అలాగే మురళీ తన చేతి బౌలింగ్ విషయంలో చూపించే కొన్ని ఎపిసోడ్స్ బావున్నాయి.

తాను తనని ప్రూవ్ చేసుకోవాలి అనుకునే విధానం పర్శనల్ లైఫ్ లో మురళీధరన్ కి ఇంత వ్యథ ఉందా అనే పాయింట్స్ బాగున్నాయి. ఇక ఈ చిత్రంలో వీటితో పాటుగా సినిమాలో కనిపించిన ముఖ్య నటులు నాజర్, అరుళ్ దాస్ మహిమా నంబియార్ తదితరులు తమ పాత్రలు పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

 

మైనస్ పాయింట్స్ :

మెయిన్ గా ఈ సినిమా ఇది వరకు వచ్చిన స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ చిత్రాల తరహాలో అయితే పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా లేదు. ఓ స్పోర్ట్స్ పర్శన్ తాలూకా జీవిత చరిత్ర అంటే చాలా మంది తన ప్రొఫిషినల్ లైఫ్ లో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి ఆ హై మూమెంట్స్ లాంటివి ఆశిస్తారు. అయితే వాటిని ఎలా ప్రెజెంట్ చేశారు అనేది కూడా అక్కడ కీలకం.

కానీ ఈ చిత్రంలో అనూహ్యంగా ఇది బాగా మిస్ అయ్యింది. ముత్తయ్య క్రికెట్ లైఫ్ కి సంబంధించి చాలానే సీన్స్ ఉంటాయి కానీ అవేవి అంత ఆసక్తిగా ఉండవు. జస్ట్ కొన్ని సన్నివేశాలు మినహా అంత ఇంప్రెసివ్ గా ఉండవు. అలానే సినిమా ఫస్టాఫ్ బాగా ల్యాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. దీనితో అక్కడక్కడా బోర్ ఫీల్ కలుగుతుంది.

ఇంకా సినిమాలో నరేషన్ స్క్రీన్ ప్లే ఇంకా బెటర్ గా డిజైన్ చేయాల్సింది. వీటితో పాటుగా చాలా సీన్స్ లో వి ఎఫ్ ఎక్స్ చాలా తక్కువ క్వాలిటీలో కనిపిస్తాయి. ఇంకా మెయిన్ గా బయోపిక్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా కీలకం అది ఎంత గ్రాండ్ గా ఉంటే సినిమా అంత ఎలివేట్ అవుతుంది కానీ ఇందులో అది కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించదు. వీటితో అయితే ఓ లెజెండరీ క్రికెటర్ సినిమా అసంపూర్తిగా అనిపిస్తుంది.

 

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదు. టెక్నీకల్ పరంగా ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. జిబ్రాన్ అందించిన సంగీతం జస్ట్ ఓకేలా ఉంది. ఆర్ డి రాజశేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ పర్వాలేదు. సినిమా టోన్ ని బాగా చూపించారు. ప్రవీణ్ కే ఎల్ ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది.

ఇక దర్శకుడు ఎం ఎస్ శ్రీపతి విషయానికి వస్తే..తాను ఈ చిత్రానికి జస్ట్ ఓకే అనిపించే రేంజ్ వర్క్ చేశారు అని చెప్పాలి. కొన్ని ఎమోషన్స్ వరకు పర్లేదు కానీ ఇక మిగతా అంతా ఓ సూపర్ బయో పిక్ చూస్తున్న ఫీల్ ని అయితే తీసుకురాలేదు. స్పోర్ట్స్ – ఎమోషన్ ని తాను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. స్క్రీన్ ప్లే, నరేషన్ ఇంకాస్త ఎంగేజింగ్ గా డిజైన్ చేసుకోవాల్సింది.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ కి సంబంధించి చాలా కాలం తర్వాత వచ్చిన ఈ బయోపిక్ “800” లో కేవలం కొన్ని అంశాలు మాత్రమే బాగున్నాయి. మధుర్ మిట్టల్ ముత్తయ్య మురళీధరన్ గా చాలా సిన్సియర్ అటెంప్ట్ చేసాడు. అలాగే సెకండాఫ్ లో కొన్ని ఎమోషన్స్ బాగున్నాయి. కానీ క్రికెట్ సంబంధించి అంత హై మూమెంట్స్ కోసం ఈ చిత్రానికి వెళితే నిరాశ చెందుతారు. అందుకే బాగా తక్కువ అంచనాలు పెట్టుకుని కేవలం మురళీధరన్ పర్శనల్ లైఫ్ లో ఏం జరిగింది అనే వాటి కోసం అయితే ఒక్కసారికి చూసేందుకు పర్వాలేదు అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version