టీజర్ తో మంచి హైప్ తెచ్చుకున్న “అయలాన్”


కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా దర్శకుడు ఆర్ రవికుమార్ తెరకెక్కిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “అయలాన్” కోసం అందరికి తెలిసిందే. మరి ఇండియన్ సినిమా నుంచి వచ్చిన కొన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ చిత్రాల్లో ఒకటిగా ఇది కూడా అని చెప్పొచ్చు.

మరి ఫస్ట్ లుక్ పోస్టర్ సహా గ్లింప్స్ సాలిడ్ బజ్ ని తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు టీజర్ తో అయితే మరింత హైప్ ని తెచ్చుకుంది అని చెప్పాలి మేకర్స్ నిన్ననే తమిళ్ మరియు తెలుగు టీజర్ లను రిలీజ్ చేయగా రెండు భాషల ఆడియెన్స్ ని ఈ టీజర్ ఇంప్రెస్ చేసింది. దీనితో వచ్చే ఏడాది సంక్రాంతి కోసం మాత్రం అంతా మంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఫుల్ మూవీ పరంగా ఈ సినిమా అనుకున్న రేంజ్ అంచనాలు అందుకుంటుందో లేదో చూడాలి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version