సమీక్ష : ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ – ఆహా లో తెలుగు మూవీ

MAD Movie Review in Telugu

విడుదల తేదీ : అక్టోబరు 06, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: హెబ్బా పటేల్, రామ్ కార్తీక్, నరేష్, పవిత్ర లోకేష్, రత్న శేఖర్ రెడ్డి, జయప్రకాష్, డెబోరా డోరిస్, లక్ష్మీ నారాయణ తదితరులు.

దర్శకుడు : విప్లవ్ కోనేటి

నిర్మాతలు: విప్లవ్ కోనేటి

సంగీతం: శ్రీచరణ్ పాకాల

సినిమాటోగ్రఫీ: అనంతరాగ్ కావూరి, అజయ్ వి. నాగ్

ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తాజాగా విప్లవ్ కోనేటి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ నిన్న ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ యొక్క పూర్తి సమీక్ష ఇప్పుడు చూద్దాం.

 

కథ :

అనాధ అయిన హేమంత్ (రామ్ కార్తీక్) తన ఫ్రెండ్ తో కలిసి కాఫీ షాప్ ని రన్ చేస్తూ ఉంటాడు. అయితే తరచు తన షాప్ కి కూకీస్ తీసుకువచ్చే చైత్ర (హెబ్బా పటేల్) ని ప్రేమించి ఆ విషయాన్ని ఆమెకు చెప్తాడు హేమంత్. కానీ ఆమె అతడి ప్రేమని రిజెక్ట్ చేస్తుంది. కాగా చైత్ర యొక్క జ్ఞాపకాలను మర్చిపోవడానికి సిటీ వదిలి వెళ్లాలని భావిస్తాడు హేమంత్. అదే సమయంలో అతడిపై ప్రేమని బయటపెడుతుంది చైత్ర. అయితే తాను పెళ్లి మాత్రం చేసుకోలేనని దానికి కారణం త్వరలో తాను చనిపోతుండడమే అని హేమంత్ కి చెప్తుంది చైత్ర. తాను మాత్రమే కాదు తన ఫ్యామిలీ మొత్తం కూడా మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకోబోతున్నట్లు ఆమె చెప్తుంది. మరి చైత్ర ఫ్యామిలీ ఒక్కసారిగా అంతపని ఎందుకు చేయాలనుకున్నారు, మరి హేమంత్ ఏమి చేసాడు, అనంతరం ఏమి జరిగింది అనేది మొత్తం సినిమాలో చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

గతంలో వచ్చిన పలు డాక్యుమెంటరీల మాదిరిగా ఈ మూవీ కూడా మూకుమ్మడి ఆత్మహత్యలని బేస్ చేసుకుని సాగుతుంది. అలానే ఇటీవల వచ్చిన బురారీ డెత్స్ ని ఆధారంగా తీసుకుని ఈ మూవీ తీసినట్లు మనకు అర్ధం అవుతుంది. అయితే దీని ట్రీట్మెంట్ మాత్రం కొంత వేరుగా ఉంటుంది. తమ ఇంట్లో చనిపోయిన ఒక వ్యక్తి తిరిగి వస్తారు అనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ మొత్తం మూకుమ్మడి ఆత్మహత్యలకు ప్రయత్నిస్తారు. అయితే చైత్రని ప్రేమించిన హేమంత్ ఆమె ఇంటి వారు అసలు ఏ ఉద్దేశ్యంతో ఇలా అందరూ ఆత్మహత్యలకు సిద్ధం అయ్యారు అనేది తెలుసుకోవడంలో అతడి పాత్ర నడిపిన తీరు బాగుంటుంది. ఈ సినిమాలో ముఖ్య కథాంశంతోనే ఊహించని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా దాగి ఉన్నాయి. చివరి అరగంట చాలా వరకు ట్విస్టులతో ఆడియన్స్ ని ఎంతో థ్రిల్ చేస్తుంది. దర్శకుడు తీసుకున్న పాయింట్ ని చివర్లో ఎండ్ చేసిన విధానం బాగుంది. ప్రధాన పాత్ర చేసిన హెబ్బా పటేల్ తో పాటు రామ్ కార్తీక్ కూడా తన పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించారు. నరేష్, పవిత్ర లోకేష్, రత్నశేఖర్ రెడ్డి, డెబోరా డోరిస్ అందరూ కూడా తమ పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకున్నారు.

 

మైనస్ పాయింట్స్ :

అయితే ఇటువంటి మూవీస్ కి స్క్రీన్ ప్లే అనేది రేసి గా ఉంటేనే ఆకట్టుకుంటుంది. అయితే మధ్యలో ఈ స్టోరీ చాలా వారు స్లో అవ్వడంతో పాటు ఎంతో నార్మల్ గా సాగుతుంది. కొన్ని అనవసరమైన సీన్స్ కూడా సినిమాలో తీసితె బాగుండేది అనిపిస్తుంది. సినిమాలో జయప్రకాశ్ యొక్క పాత్రని దర్శకుడు మరింత బాగా రాసుకుని చూపించి ఉంటె బాగుండేది అనిపిస్తుంది. అలానే హర్రర్ ఎలిమెంట్స్ ని కూడా యాడ్ చేసి ఉంటె బాగుండేది. అయితే మేకర్స్ ఆ కోణంలో ని మాత్రం ఎందుకో ఆలోచించలేదు. అయితే ఈ మూవీ లోని కొన్ని సన్నివేశాలు ఫ్యామిలి ఆడియన్స్ కి ఇబ్బందికరంగా ఉంటాయి.

 

సాంకేతిక వర్గం :

శ్రీచరణ్ పాకాల అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. అనంతరాగ్ కావూరి, అజయ్ వి. నాగ్ ల విజువల్స్, ఫోటోగ్రఫి బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అయితే చివర్లో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది. ఇక డైరెక్టర్ విప్లవ్ కోనేటి విషయానికి వస్తే మంచి సోషల్ ఇష్యూ ని తీసుకుని దానిని స్క్రీన్ పై తెరకెక్కించిన తీరు అభినందనీయం. స్క్రీన్ ప్లే బాగున్నప్పటికీ అది మధ్యలో కొంత నెమ్మదించడం ఇబ్బందికరంగా ఉంటుంది.

 

తీర్పు :

మొత్తంగా ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనే ఈ మూవీ ఇంట్రెస్టింగ్ గా ఆకట్టుకుంటుంది. అయితే మొత్తంగా కాదు, మధ్యలో సాగతీతగా ఉన్నప్పటికీ చివర్లో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది. హెబ్బా పటేల్, రామ్ కార్తీక్ తమ పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకున్నారు. మధ్యలో అక్కడక్కడా కొన్ని ఇబ్బందికర సన్నివేశాలు తప్పించి మొత్తంగా అయితే ఈ వారం ఈ మూవీని ఆహాలో చూసేయొచ్చు.

123telugu.com Rating:2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version