బిగ్ బాస్ సీజన్-7లో ఈ వారం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. నటి శుభశ్రీతో పాటు నటుడు గౌతమ్ కృష్ణ కూడా ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. నిజానికి శుభశ్రీ ఎలిమినేట్ అయిందని.. ముందే వార్తలు వచ్చాయి. కానీ, గౌతమ్ కూడా ఎలిమినేట్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన చివరి ముగ్గురు కంటెస్టెంట్లుగా శుభశ్రీ, గౌతమ్‌కృష్ణ, టేస్టీ తేజలు నిలబడగా.. వీరిలో శుభశ్రీ తొలుత ఎలిమినేట్ అయింది.
ఈ క్రమంలో హౌస్‌లో ఉన్న ఎనిమిది మందిలో ఆరుగురు టేస్టీ తేజను సపోర్ట్ చేస్తూ ఓటు వేయడంతో.. గౌతమ్ కూడా ఇంటి నుంచి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. బయటకు వచ్చాక గౌతమ్ పలువురు హౌస్మేట్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా శివాజీ గురించి మాట్లాడుతూ.. ‘ఆయనలో ఫేక్ సైడ్ఉంది. ఆయనకు నచ్చిన వ్యక్తులకు ఓటు వేస్తారు అని అన్నారు. అలాగే ప్రశాంత్ గురించి మాట్లాడుతూ.. ప్రశాంత్ సేఫ్ గేమ్ ఆడాడు. శివాజీ ఏది ఆడితే, అది ఆడతాడు’ అని కామెంట్స్ చేశాడు.