బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న అలియా భట్ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’తో హాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. తాజాగా అలియా భట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ కు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. ఇంతకీ, అలియా ఏం మాట్లాడింది అంటే.. ‘దర్శకులు సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహార్ ల నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అలాగే, హీరో షారుక్ వల్లే నేను సెట్లో ఎలా మెలగాలో తెలుసుకున్నాను’ అని అలియా చెప్పుకొచ్చింది.
అలాగే, తాను చేసిన ప్రతి సినిమా నుంచి ఏదో విషయాన్ని నేర్చుకున్నట్లు అలియా భట్ చెప్పింది. ‘ప్రస్తుతం నేను సెట్లో అందరితో ఎలా కలిసిమెలసి ఉంటున్నానో.. అది షారుక్ నుంచే నేర్చుకున్నాను. ప్రతి సన్నివేశాన్ని ఎలా అర్థం చేసుకోవాలో షారుఖ్ కి బాగా తెలుసు. నేను కూడా ఈ విషయంలో షారుఖ్ ని చూసి తెలుసుకున్నాను. నాపై ప్రభావం చూపిన వ్యక్తుల్లో షారుక్ ముఖ్యమైన వ్యక్తి’ అంటూ అలియా తెలిపింది.