“లియో” హైప్ కోసం చరణ్ పేరు వాడుకుంటున్నారా?

ప్రస్తుతం తమిళ సినిమా నుంచి భారీ హైప్ లో ఉన్న చిత్రం “లియో” కోసం అందరికీ తెలిసిందే. దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “లియో”. మరి పాన్ ఇండియా వైడ్ ఏమో కానీ తెలుగులో సహా ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రంపై గట్టి అంచనాలు ఉన్నాయి. మరి వీటితో పాటుగా వీటి అన్నిటిని మించి ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా మారుతున్నా అంశం అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రెజెన్స్ కోసమే అని చెప్పాలి.

అయితే తాను ఉన్నాడు లేదు అనేది ఇప్పటికి అప్రస్తుతం కానీ ఉన్నాడు అనే టాక్ కేజ్రీగా మారుతుంది. చాలా మంది అయితే ప్రస్తుతానికి మంచి సస్పెన్స్ లో ఉండగా లియో కి సంబంధించి ఓవర్సీస్ బుకింగ్స్ సైట్స్ లో అయితే సినిమా లీడ్ క్యాస్టింగ్ లో రామ్ చరణ్ పేరుని కూడా పొందుపరుస్తున్నారు.

దీనితో అసలు ఇది నిజమో కాదో కానీ ఈ క్యాస్టింగ్ లో చరణ్ పేరు చేర్చడంతో మాత్రం సోషల్ మీడియాలో సహా మూవీ లవర్స్ లో మాత్రం లియో పై హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. అయితే లియో పై ఆల్రెడీ మంచి హైప్ ఉంది కానీ చాలా కాలం నుంచి చరణ్ పేరు బాగా వైరల్ అవ్వడం ఇప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ అవ్వడంతో పనిలో పని ఫ్రీగా వస్తున్నా క్రేజ్ ని ఇలా వాడుకుంటున్నారని అనుకోవాలి. మరి ఈ హైప్ ని మ్యాచ్ చేస్తూ సినిమాలో చరణ్ ఉంటాడో లేదో జస్ట్ కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.

Exit mobile version