సమీక్ష : నీతోనే నేను – బోరింగ్ గా సాగే ఎమోషనల్ డ్రామా

Nethone Nenu Movie Review in Telugu

విడుదల తేదీ : అక్టోబరు 13, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

నటీనటులు: వికాస్ వశిష్ట, మోక్ష, కుషిత కల్లపు, ఆకాష్ శ్రీనివాస్, హారిక పెడద, నళిని, అనిల్ కుమార్, తదితరులు

దర్శకుడు : అంజి రామ్

నిర్మాత: మామిడి సుధాకర్ రెడ్డి

సంగీతం: కార్తీక్ కొడకండ్ల

సినిమాటోగ్రఫీ: మురళీమోహన్ రెడ్డి

ఎడిటర్: ప్రతాప్ కుమార్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 


వికాస్ వశిష్ట, మోక్ష, మరియు కుశిత కల్లపు నటించిన నీతోనే నేను అనే తెలుగు చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

 

కథ:

రామ్ (వికాస్ వశిష్ట) ఒక గవర్నమెంట్ స్కూల్ లో డెడికేటెడ్ గా వర్క్ చేసే టీచర్. ఆయేషా (కుషిత కల్లపు) అతని పై అభిమానం చూపే స్కూల్ పీటి టీచర్. సీత (మోక్ష)తో రామ్ వివాహాన్ని తెలుసుకున్న తరువాత ఆయేషా మనసు విరిగిపోతుంది. కథ లోకి వెళ్తున్నప్పుడు, రామ్ యొక్క అంతుచిక్కని గతం గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడుతుంది. అప్పుడు ఆమె షాక్ కి గురి అవుతుంది. అది ఏమిటి? అసలు రామ్ ఎవరు? అతని కథలో ఏ రహస్యాలు దాగి ఉన్నాయి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి.

 

ప్లస్ పాయింట్స్:

సినిమా బండి మరియు ముఖచిత్రం వంటి చిత్రాల్లో మంచి నటనతో పేరు సంపాదించుకున్న వికాస్ వశిష్ట, ఈ చిత్రంలో తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు. టీచర్ గా బాగా నటించారు.

సోషల్ మీడియా సెన్సేషన్ అయిన కుషిత కల్లపు ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మంచి నటన కనబరిచి, తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది.

లిమిటెడ్ స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ, మోక్ష తన పాత్రలో బాగా ఆకట్టుకుంది. కేరింగ్ చూపించే భార్యగా బాగా నటించింది. ఇతర నటీనటులు తమ తమ పాత్రల్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

 

మైనస్ పాయింట్స్:

ప్రొడ్యూసర్ మామిడి సుధాకర్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే తో పాటుగా డైలాగ్ రైటర్ గా కూడా వ్యవహరించారు. అయితే అసలు సమస్య కథలోనే ఉంది. కథ చాలా తెలుగు చిత్రాలను గుర్తుకు తెస్తుంది. మొదటి కొన్ని నిమిషాల్లోనే ఇంటర్వెల్ ట్విస్ట్‌ను ఊహించవచ్చు. ప్లాట్‌లో కొత్తదనాన్ని తీసుకు రావడానికి కొంచెం బెటర్ గా వర్క్ చేసి ఉంటే బాగుండేది.

కథాంశం అంత ఆసక్తికరం గా సాగదు. వీక్ స్క్రీన్ ప్లే తో చాలా స్లో గా సినిమా సాగుతుంది. డైరెక్టర్ అంజి రామ్ పాత్రలకు మరియు కథకు మరింత బెటర్ ట్రీట్‌మెంట్ అందించే అవకాశాన్ని కోల్పోయాడు అని చెప్పాలి.

ఈ సినిమా, TV సీరియల్‌ను పోలి ఉండే అనేక మెలోడ్రామాటిక్ సన్నివేశాలతో ఉంది. కొన్ని సన్నివేశాలు మరి సాగదీసినట్లు ఉంటాయి. ముఖ్యం గా చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్ లో ఇలాంటి సీన్స్ ఎక్కువగా ఉన్నాయి.

కార్తీక్ కొడకండ్ల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలలో బాగుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. అయితే సినిమాలో చాలా వరకు డైలాగ్‌లు నాటకీయంగా కనిపిస్తాయి.

 

సాంకేతిక విభాగం:

దర్శకుడు అంజి రామ్ తన డైరెక్షన్ తో అంతగా ఆకట్టుకోలేదు. సినిమా అంచనాలకు ఏ విధంగా కూడా అందదు. మామిడి సుధాకర్ కథనంలో కొత్తదనం లేదు. సినిమాకి మరింత ఆకర్షణీయమైన స్క్రీన్‌ప్లే ఉండి ఉంటే బాగుండేది.

పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలను హైలైట్ చేసింది. ఎడిటర్ ప్రతాప్ కుమార్ సాగతీత మరియు అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ యావరేజ్ గా ఉన్నాయి.

 

తీర్పు:

మొత్తం మీద నీటినే నేను అంటూ థియేటర్ల లోకి వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోదు. ప్రధాన నటీనటుల పర్ఫార్మెన్స్ లు బాగానే ఉన్నప్పటికీ, ఔట్ డేటెడ్ ఎమోషనల్ కాన్సెప్ట్ మరియు కథలో ఎలాంటి కొత్తదనం లేకపోవడం లాంటి అంశాలు సినిమా ఫలితం పై ప్రభావం చూపాయి. అంతేకాక ఓవర్ గా అనిపించే ఎమోషనల్ సన్నివేశాలు, చాలా నీరసం గా సాగే స్క్రీన్ ప్లే ఉండటం తో సినిమా ఆకట్టుకోదు.

123telugu.com Rating: 1.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version