ఇపుడు వరుస హిట్స్ తో కోలీవుడ్ సినిమా మళ్ళీ ఫామ్ లోకి రాగా ఈ దసరా కానుకగా వచ్చిన భారీ సినిమా “లియో” సెన్సేషనల్ హిట్ కాగా ఈ పండుగ తర్వాత అయితే దీపావళి కానుకగా మరిన్ని సాలిడ్ చిత్రాలు రానుండగా తమిళ్ తో పాటుగా తెలుగు ఆడియెన్స్ ఆసక్తిగా ఉన్న ఓ చిత్రం ఉంది. అదే “జిగర్ తండా డబుల్ ఎక్స్”.
మరి పార్ట్ 1 తమిళ్ మంచి హిట్ అవ్వడం దీన్ని తెలుగులో రీమేక్ చేయడంతో తెలుగులో కూడా మంచి సక్సెస్ అయ్యింది. అయితే ఆ చిత్రంతో ఒరిజినల్ కూడా బాగా పాపులర్ గా మారడంతో ఈసారి ఒరిజినల్ కి సీక్వెల్ ని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఫిక్స్ చేసారు. మరి ఈ క్రేజీ గ్యాంగ్స్టర్ డ్రామా శాటిలైట్ హక్కులు డీల్ క్లోజ్ అయ్యిపోయింది.
ఈ సినిమా హక్కులని సన్ నెట్వర్క్ వారు తమిళ్ సహా తెలుగులో సొంతం చేసుకున్నారు. తెలుగులో ఈ సినిమా జెమినీ టీవిలో ప్రసారం కానుండగా తమిళ్ లో సన్ టీవీ లో పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ రానుంది. ఇక ఈ చిత్రానికి అయితే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించగా రాఘవ లారెన్స్ మరియు ఎస్ జె సూర్య లు ఈ చిత్రంలో నటించారు.
#JigarthandaDoubleX satellite rights acquired by @GeminiTV ????@karthiksubbaraj @offl_Lawrence @iam_SJSuryah @dop_tirru @Music_Santhosh @stonebenchers #AlankarPandian #InvenioOrigin @RedGiantMovies_ @5starcreationss @thinkmusicindia @ahimsafilms #GeminiTV#DoubleXDiwali pic.twitter.com/szneuA0AS6
— Gemini TV (@GeminiTV) October 26, 2023
#JigarthandaDoubleX satellite rights acquired by @SunTV ????@karthiksubbaraj @offl_Lawrence @iam_SJSuryah @dop_tirru @Music_Santhosh @kaarthekeyens @stonebenchers #AlankarPandian #InvenioOrigin @RedGiantMovies_ @5starcreationss @thinkmusicindia #SunTv #DoubleXDeepavali pic.twitter.com/Yvz45R39I0
— Sun TV (@SunTV) October 26, 2023