ఇళయ దళపతి విజయ్ హీరోగా త్రిష కృష్ణన్ హీరోయిన్ గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన మాస్ హిట్ చిత్రం “లియో” ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర అయితే కాస్త నెమ్మదించింది. మొదటి వారంలోనే ఆ ఊపుతో భారీ వసూళ్లు రాబట్టేసిన ఈ చిత్రం ఇప్పుడు స్లో కాగా చిత్ర యూనిట్ కి అయితే ఊహించని షాక్ తగిలింది.
ఈ సినిమా తాలూకా ఒరిజినల్ వెర్షన్ తమిళ్ ఫుల్ క్లారిటీ ప్రింట్ అయితే ఇప్పుడు లీక్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. దీనితో లాస్ట్ టైం కోలీవుడ్ హిట్ చిత్రం “జైలర్” కి కూడా ఇలానే జరగడంతో మేకర్స్ వెంటనే ఓటీటీ రిలీజ్ చేసేసారు. మరి ఇప్పుడు ఇదే కారణంతో లియో కూడా రిలీజ్ చేసేస్తారేమో అనేది చూడాలి. కానీ సినిమా రిలీజ్ అయ్యిన రెండు వారల్లోనే హెచ్ డి ప్రింట్ లీక్ అవ్వడంతో తమిళ తంబీలు ఇప్పుడు షాకవుతున్నారు.