సమీక్ష : “మంగళవారం” – పర్వాలేదనిపించే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ !

Mangalavaaram Movie Review in Telugu

విడుదల తేదీ : నవంబర్ 17, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: పాయల్ రాజ్ పుత్, దివ్య పిళ్ళై, అజ్మల్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్, రవీంద్ర విజయ్, శ్రావణ్ రెడ్డి, శ్రీ తేజ్ తదితరులు

దర్శకుడు : అజయ్ భూపతి

నిర్మాతలు: స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం

సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్

సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర

ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్ళపల్లి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మంగళవారం’. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

మాహాలక్ష్మీపురంలో గ్రామ దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజునే అక్రమ సంబంధాలు పెట్టుకున్న జంటలు చనిపోతూ ఉంటారు. వారంతా ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆ ఊరి ప్రజలంతా భావిస్తారు. కానీ, ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై మీనా (నందితా శ్వేత) మాత్రం ఎవరో వారిని హత్య చేశారని అనుమానిస్తోంది. ఇంతకీ వాళ్ళవి ఆత్మహత్యలా ?, లేక హత్యలా ?, ఈ వరుస మరణాల నేపథ్యంలో కొన్నాళ్ళ ముందు ఆ ఊరంతా వేలి వేసిన శైలు… శైలజ (పాయల్) కథ ఏమిటి?, ఈ మధ్యలో రవి పాత్ర ఏమిటి?, అలాగే ఆ ఊరు జమీందారు ప్రకాశం బాబు (చైతన్య కృష్ణ) పాత్ర ఏమిటి?, అసలు ఇంతకీ శైలు కథకు ఇప్పుడు ఊరిలో జరుగుతున్న హత్యలకు సంబంధం ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

అక్రమ సంబంధాల నేపథ్యంలో వచ్చిన ఈ మర్డర్ మిస్టీరియస్ థ్రిల్లర్ లో కొన్ని హారర్ సన్నివేశాలతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహకు అందలేదు. దర్శకుడు రాసుకున్న క్రైమ్ డ్రామా కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్ గా సాగింది. ముఖ్యంగా సినిమాలో ట్విస్ట్ లు ఆకట్టుకున్నాయి. నందిత శ్వేత సీరియస్ పోలీస్ అధికారిణిగా ఆకట్టుకున్నారు. కృష్ణ చైతన్య నటన అండ్ మేనరిజమ్ బాగున్నాయి.

బోల్డ్ అండ్ లవ్ సన్నివేశాల్లోని పాయల్ రాజ్ పుత్ నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. కథ రీత్యా హీరోయిన్ పాయల్ పాత్రకు అంత పెద్దగా నిడివి లేకున్నప్పటికీ ఆమె తన నటనతో మెప్పించింది. దివ్య పిళ్ళై నటన కూడా బాగుంది. అలాగే, అజ్మల్, అజయ్ ఘోష్, రవీంద్ర విజయ్, శ్రావణ్ రెడ్డి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు అక్రమ సంబంధాల చుట్టూ అనేక కోణాల్లో సినిమాని నడిపిన విధానం కొన్ని చోట్ల బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ మంగళవారం సినిమాలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్నా.. కొన్ని చోట్ల ప్లే చాలా సింపుల్ గా సాగుతుంది. అలాగే బోల్డ్ పాయింట్ అండ్ కంటెంట్ ఉన్నా.. మెయిన్ ప్లాట్ కూడా సింపుల్ గా ఉంది. అదేవిధంగా రవి పాత్రలో నటించిన నటుడు కూడా ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ కాలేదు. మొత్తానికి మేకర్స్ తాము అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. కొన్ని సీన్స్ విషయంలో అసలు బాగాలేదు. అలాగే, ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు కూడా ఆకట్టుకోవు. అలాగే సినిమాలో నాటకీయత ఎక్కువ అవ్వడంతో సహజత్వం లోపించింది.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు అజయ్ భూపతి మంచి క్రైమ్ థ్రిల్లర్స్ కి గుడ్ ట్రీట్మెంట్ ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. హీరోయిన్ ట్రాక్ ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా నేచురల్ గా చూపించారు. సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

మంగళవారం అంటూ వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ థ్రిల్లర్ లో.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు బోల్డ్ సీన్స్ మరియు కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. అయితే, ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. కానీ, సినిమాలో టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ బాగుంది. మొత్తమ్మీద ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఓ వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కానీ మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఏవరేజ్ అనిపిస్తోంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version