సమీక్ష : అన్వేషి – బోరింగ్ క్రైమ్ సస్పెన్స్ డ్రామా !

Anveshi Movie Review in Telugu

విడుదల తేదీ : నవంబర్ 17, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: అనన్య నాగళ్ల, విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అజయ్ ఘోష్ తదితరులు

దర్శకుడు : వీజే ఖన్నా

నిర్మాత: గణపతి రెడ్డి

సంగీతం: చైత‌న్ భ‌ర‌ద్వాజ్

సినిమాటోగ్రఫీ: కెకె రావు

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

అనన్య నాగళ్ల కీలక పాత్రలో విజయ్ ధరణ్ దాట్ల హీరోగా సిమ్రాన్ గుప్తా హీరోయిన్ గా వచ్చిన సినిమా అన్వేషి. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

డాక్టర్ అను (అనన్య నాగళ్ళ) తన తండ్రి కోరిక మేరకు సొంతూరులో అను హాస్పిటల్ పెట్టి ప్రజలకు సేవ చేస్తోంది. అయితే, కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అను హాస్పిటల్ అగ్ని ప్రమాదంలో తగలబడి, డాక్టర్ అను, ఆమె తండ్రి చనిపోతారు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అను హాస్పిటల్ చుట్టూ వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో విక్రమ్ (విజయ్ ధరణ్ దాట్ల) ఆ హత్యల వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇంతకీ ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు ?, ఈ మధ్యలో అను (సిమ్రాన్ గుప్తా)తో విక్రమ్ ప్రేమ కథ ఎలా సాగింది ?, చివరకు ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించిన విజ‌య్ ధ‌ర‌ణ్‌, సిమ్రాన్ గుప్తా, అన‌న్య నాగ‌ళ్ల బాగానే నటించారు. ముఖ్యంగా నటుడు అజయ్ ఘోష్ తన నటనతో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హీరోగా విజ‌య్ ధ‌ర‌ణ్‌ చాలా కాన్ఫిడెంట్ గా నటించారు. ఇక సినిమాలో అడవి నేపథ్యంలో నడిచే సన్నివేశాలు.. అదేవిధంగా అను హాస్పిటల్ చుట్టూ జరిగే హత్యలు, ఆ హత్యల వలయాన్ని చేధించడానికి హీరో ప్రయత్నించే సన్నివేశాలు, ఈ క్రమంలో సాగే డ్రామా పర్వాలేదు.

హీరోయిన్ సిమ్రాన్ గుప్తా తన అందంతో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. అన‌న్య నాగ‌ళ్ల కూడా మెప్పించింది. కానీ ఆమె పాత్రకు ఎక్కువ నిడివి లేదు. ఉన్నంతలో ఆమె తన పాత్రకు న్యాయం చేసింది. అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే క్రైమ్ సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. రచ్చ రవి, దిల్ రమేష్ తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో ముఖ్యంగా క్లైమాక్స్ వరకు థ్రిల్లింగ్‌గా సాగితేనే ప్రేక్షకులు ఇష్టపడతారు. కానీ ఈ అన్వేషిలో ఆ సస్పెన్స్ మొదటి నుంచి మిస్ అయ్యింది. ఇక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ గురించి అనవసరం. నిజానికి దర్శకుడు కొన్ని బలమైన క్రైమ్ మూమెంట్స్ పెట్టి మంచి డ్రామా రాబట్టే ప్రయత్నం చేశాడు గానీ, అది ఏ మాత్రం ఎఫెక్టివ్ గా లేదు. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో సినిమాలోని పాత్రలను పరిచయం చెయ్యడానికే, అలాగే ఆ పాత్రల్లో ప్రేక్షకులను ఇన్ వాల్వ్ చేయడానికి కూడా దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు.

అలాగే విలన్ పెద్దిరెడ్డి క్యారెక్టర్ ఎండింగ్ ను కూడా సింపుల్ గా ముగించేయడం బాగాలేదు. అదే విధంగా రెగ్యులర్ కామెడీతో అక్కడక్కడా నవ్వించినా.. చాలా సీన్స్ వర్కౌట్ కాలేదు. ఇక ప్రధాన పాత్రల మధ్య ఉన్న కామెడీ కంటెంట్ కూడా ఇంకా బాగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ కంటెంట్ ను కూడా సరిగ్గా వాడుకోలేదు. కథ కూడా చాలా సింపుల్ గా ఉంది. ఇక ప్లే కూడా వెరీ రెగ్యులర్ గా సాగింది.

అలాగే సినిమాలో సరైన ప్లో కూడా లేకపోవడం, సెకండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలన్నీ బాగా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం వంటి అంశాలు సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. కొన్ని అడవి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను అలాగే క్లైమాక్స్ లోని యాక్షన్ కంటెంట్ ను దర్శకుడు వీజే ఖన్నా బాగా తెరకెక్కించినా.. టోటల్ గా ఫెయిల్ అయ్యాడు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక కెకె రావు సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెకె రావు చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాత గణపతి రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అతని నిర్మాణ విలువులు బాగున్నాయి.

 

తీర్పు :

 

అన్వేషి అంటూ వచ్చిన ఈ క్రైమ్ సస్పెన్స్ డ్రామా ఆకట్టుకునే విధంగా సాగలేదు. మెయిన్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, సినిమా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం మరియు బోరింగ్ ప్లే వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. కానీ, కొన్ని క్రైమ్ సీన్స్, నటీనటుల పనితీరు మాత్రం పర్వాలేదు. ఓవరాల్ గా ఈ సినిమా మెప్పించదు.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version