పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ భారీ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించగా ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి ఈ సమయంలో మేకర్స్ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి ఈ కొన్ని రోజులు సాలిడ్ అప్డేట్స్ అందించగా ఇప్పుడు ఈ చిత్రం గ్లోబల్ రిలీజ్ కి సంబంధించి ఓవర్సీస్ మార్కెట్ లో ఎవరు రిలీజ్ చేస్తున్నారో కన్ఫర్మ్ చేశారు.
మరి ఈ అవైటెడ్ సినిమాని వరల్డ్ వైడ్ గా ఇండియా మినహా ప్రముఖ సంస్థ పార్స్ ఫిల్మ్స్ వారు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో ప్రపంచ వ్యాప్తంగా సలార్ కి సాధ్యమైనంత వైడ్ రిలీజ్ రాబోతుంది అని చెప్పాలి. ఇక ఈ యాక్షన్ డ్రామా ఈ డిసెంబర్ 22న రిలీజ్ కి రాబోతుంది.
Thrilled to announce the collaboration with @PharsFilm as we bring #SalaarCeaseFire to the ???????????????????????????????? audiences, ???????????????????????????????????? ???????? ???????????????????????????????? ???????????????? ????#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms @VKiragandur @IamJagguBhai… pic.twitter.com/XxROFTEge5
— Hombale Films (@hombalefilms) November 19, 2023