రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ యాక్షన్ మూవీ యానిమల్. అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ డిసెంబర్ 1న పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీ లో నేడు గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు మేకర్స్.
కాగా ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్టులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి విచ్చేసారు. ఇక కొద్దిసేపటి క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రెండీ స్టైల్ బ్లూ కలర్ టీ షర్ట్, బ్లూ జీన్స్ తో మార్వలెస్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆయనతో పాటు రాజమౌళి ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా అందరిలో విపరీతమైన హర్షద్వానాలు మారుమ్రోగాయి. కాగా మహేష్ బాబు ఎంట్రీ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.