నేను రణబీర్ కపూర్ కి పెద్ద ఫ్యాన్ ని – సూపర్ స్టార్ మహేష్ బాబు


బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ల లేటెస్ట్ మూవీ యానిమల్ మూవీ పై అందరిలో భారీ స్థాయి అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించగా కీలక పాత్రల్లో అనిల్ కపూర్, బాబీ డియోల్, పృథ్వీరాజ్ నటించారు. ఇక ఇటీవల టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో అందరిలో అంచనాలు మరింతగా పెంచేసిన యానిమల్ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ట్రైలర్ ని నేడు హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దీనికి స్పెషల్ గెస్టులుగా విచ్చేసారు.

ఈ సందర్భంగా మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ, తాను మొదటి నుండి బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి పెద్ద ఫ్యాన్ ని అని అన్నారు. తనవి చూసినవి కొన్ని సినిమాలే అయినప్పటికి ప్రతి సినిమాలో కూడా అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో ఆయన అదరగొట్టారని, అలానే ఇటీవల యానిమల్ ట్రైలర్ చూసిన తనకు ఒక్కసారిగా మెంటల్ వచ్చేసిందన్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక, బాబీ డియోల్ వంటి అద్భుత నటులు ఎంతో కష్టపడ్డ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు సూపర్ స్టార్ మహేష్ బాబు. కాగా యానిమల్ మూవీ డిసెంబర్ 1న పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

Exit mobile version